అండర్ -19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయం.. గొంగడి త్రిష ఆల్ రౌండ్ షో

మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

India U19 Women Cricket Team

India vs South Africa U19 Womens T20 World Cup Final: మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది. తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. భారత్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో వరుసగా పెవిలియన్ బాటపట్టారు. స్వల్ప పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ జట్టు కేవలం 11.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Also Read: IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి టీ20 మ్యాచ్.. వాళ్లిద్దరిపైనే అందరి దృష్టి.. వాళ్లకు విశ్రాంతి తప్పదా..

ఈ మ్యాచ్ లో గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టిన త్రిష.. బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. తద్వారా భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలాఉంటే.. భారత్ బౌలర్లలో గొంగడి త్రిష మూడు వికెట్లు పడగొట్టగా.. వైష్ణవి శర్మ రెండు, ఆయుషి శుక్లా రెండు, పరుణిక రెండు, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టులో వాన్ వూరస్ట్ (23) ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది.