పాకిస్థాన్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే?

Indian Cricket team: ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది దేశాలు ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వచ్చే..

పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగాల్సి ఉంది. అయితే, టీమిండియాను పాకిస్థాన్‌ పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. దీనిపై బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. భారత జట్టు పాక్ కు వెళ్లే అవకాశాలు లేవని, ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను దుబాయి లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని అడుగుతామని చెప్పాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది దేశాలు ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమర్పించింది. కాగా, 2008 ఆసియా కప్ నుంచి పాకిస్థాన్‌లో భారత్ ఏ క్రికెట్ టోర్నమెంటూ ఆడలేదు.

భారత్‌లో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అదే భారత్-పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్. అప్పటి నుంచి భారత్-పాక్ ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే తలపడ్డాయి. పాక్ ప్రభుత్వ తీరు వల్ల ఆ దేశంలో ఆడేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. అలాగే, పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లకూ దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ పాల్గొనడంపై కూడా అనిశ్చితి నెలకొంది.

Also Read: పాకిస్థాన్ కోచ్‌లతో షాహీన్ షా అఫ్రిది దురుసు ప్రవర్తన!

ట్రెండింగ్ వార్తలు