Team india
Asian Games 2023 : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం గెలిచింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో సీడింగ్ ఆధారంగా టీమ్ఇండియా గోల్డ్ మెడల్ అందుకుంది. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు టాప్ సీడింగ్‌తో బరిలోకి దిగింది. ఈ క్రీడల్లో భారత మహిళల జట్టు కూడా స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 52 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాహిదుల్లా కమల్ (49 నాటౌట్; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుల్బాదిన్ నైబ్ (27 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. అభేధ్యమైన ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
Also Read: రచిన్ రవీంద్రపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్.. సచిన్ ప్రభావమే ఎక్కువట.. ఎందుకంటే?
అయితే.. 18.2 ఓవర్లకి పూర్తి అవగానే వర్షం ఆరంభమైంది. అప్పటికి ఆఫ్గానిస్తాన్ స్కోరు 112/5. డక్ వర్త్ పద్దతిలో విజేతను నిర్ణయించాలన్నా ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆసియా క్రీడల్లోని నిబంధనల ప్రకారం ఏదైన మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లలో టాప్ సీడింగ్ ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. భారత్ టాప్ సీడింగ్‌తో బరిలోకి దిగడంతో టీమ్ఇండియా విజేతగా నిలవడంతో స్వర్ణ పతకం లభించింది.
Asian Games 2022. No Result – India Wins?https://t.co/dD03qLZ93z #INDvAFG #IndiaAtAG22
— BCCI (@BCCI) October 7, 2023