IPL 2021: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఇండియన్ ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్. బీసీసీఐకి వందల కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతున్న ఐపీఎల్.. మరి ఆటగాళ్లకు ఎంత లాభం..

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్. బీసీసీఐకి వందల కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతున్న ఐపీఎల్.. మరి ఆటగాళ్లకు ఎంత లాభం తెస్తుంది. కేవలం క్రేజ్ మాత్రమేనా.. అందుకు తగ్గ అమౌంట్ కూడానా.. అసలు ఐపీఎల్ లో ఆడి ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఓ లుక్కేద్దాం రండి..

Ms Dhoni
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా మ్యాచ్ ఫీజు ఛార్జ్ చేస్తున్న ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ ద్వారా అతనికి వచ్చిన ఆదాయం ఇప్పటికే రూ.137కోట్లు దాటేయగా ప్రస్తుత సీజన్ 2021 పూర్తయ్యేసరికి రూ.150కోట్లకు చేరుకోవడం కన్ఫామ్.

Rohit Sharma
ఆరు సార్లు ఐపీఎల్ విన్నర్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకూ రూ.132కోట్లు వెనకేశాడు మరి.

Virat Kohli
సింగిల్ సీజన్ కు అత్యధికంగా ఫీజు ఛార్జ్ చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకూ రూ.126కోట్లకు పైగా సంపాదించాడు. కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే ఆడుతూ ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు.

Suresh Raina
ఐపీఎల్ లో ధోనీ తర్వాత గుర్తొచ్చే పేరు సురేశ్ రైనాదే. చిన్న తలా అని పిలుచుకునే రైనా దాదాపు రూ.100కోట్ల మార్క్ కు దగ్గరగా ఉన్నాడు. పర్సనల్ రీజన్స్ తో 2020 ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.

Gautham Gambhir
రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్ గౌతం గంభీర్. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు ప్లేయర్ గా వీడ్కోలు చెప్పేసిన గంభీర్.. ఆదాయం రూ.94కోట్లకు చేరింది. గౌతం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.

Yuvraj Singh
సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్.. ఐపీఎల్ చరిత్రలోనే కాస్ట్లీ ఆటగాడిగా నిలిచాడు ఒకానొక సమయంలో… 2008 నుంచి 2019వరకూ సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణె వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల కోసం ఆడాడు.

Robin Uthappa
కోల్‌కతా మాజీ వైస్ కెప్టెన్ రాబిన్ ఊతప్ప. లిస్టులో రూ.75కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాడు.

Shikhar Dhawan
ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదించే ప్లేయర్లలో ఒకడు శిఖర్ ధావన్. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న శిఖర్ ఖాతాలో ఐపీఎల్ సొమ్ము రూ.70కోట్లు ఉంది.

Ravindra Jadeja
లీగ్ లో ఒక సీజన్ మొత్తాన్ని మిస్ అయిన జడేజా కూడా అధికంగా సంపాదించే జాబితాలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న రవీంద్ర జడేజా రూ.70కోట్లు వసూలు చేస్తున్నాడు.

Dinesh Karthik
2020 వరకూ కోల్‌‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన ధావన్.. రూ68కోట్లకు పైనే సంపాదించాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో కలిసి ఉన్నప్పుడు ఐపీఎల్ ట్రోఫీ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు