PBKS vs RCB, Preview : గెలిచేదెవరు? ఎవరి బలం ఎంత?

PBKS vs RCB, Preview : గెలిచేదెవరు? ఎవరి బలం ఎంత?

Match Preview

Updated On : April 30, 2021 / 6:56 PM IST

Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలవగా, బెంగళూరు ఆరు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచింది.

బెంగుళూరు తమ చివరి మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది, ఇప్పుడు ఆ విజయం తర్వాత వారికి 10 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో పంజాబ్ ఆటతీరు నిరాశపరుస్తుంది. క్రిస్ గేల్, కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా ఈ సీజన్‌లో రాణించట్లేదు. స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నప్పటికీ మ్యాచ్‌లు గెలవలేకపోతున్నారు. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరవ ప్లేస్‌లో ఉంది.

PBKS vs RCB హెడ్ టు హెడ్.. పంజాబ్, బెంగళూరు జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడగా.. పంజాబ్ 14 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం రెండు జట్లూ పట్టుదలతో కృషి చేస్తున్నాయి.

పిచ్ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటివరకు పరుగులు చేయడం కష్టంగా ఉంది. బంతి పాతది అయ్యాక పరుగులు చేయడం సులభం అవుతుంది. స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలంగా లేదు. రాత్రి మ్యాచ్‌లో, మంచు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ ఫీల్టింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాస్తవానికి, ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబికి పైచేయి ఉన్నప్పటికీ, పంజాబ్ కింగ్స్ గెలవవచ్చునని తెలుస్తోంది. బ్యాటింగ్ అనేది రెండు జట్ల బలం మరియు ఈ రెండింటిలో ఎవరు బాగా రాణించినా నేటి మ్యాచ్‌లో విజయం సాధించవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Probable XI): దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, డివిలియర్స్, డేనియల్ సామ్స్, వాషింగ్టన్ సుందర్, కైల్ జామిసన్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్.

పంజాబ్ కింగ్స్(Probable XI): KL రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, డేవిడ్ మలన్ / నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ మరియు అర్షదీప్ సింగ్.