Indian Sports Legend PT Usha Husband V Srinivasan Dies
PT Usha : భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.
కుటుంబ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీనివాసన్ తన నివాసంలో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయన మృతి చెందినట్లు వెల్లడించారని తెలిపారు. ఈ విషయం తెలిసి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Abhishek Sharma : బ్లాక్ డ్రెస్‌లో అభిషేక్ శర్మ.. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో చూశారా?
ఫోన్ చేసిన ప్రధాని మోదీ..
శ్రీనివాసన్ తుది శ్వాస విడిచారు అన్న విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ.. పీటీ ఉషకు ఫోన్ చేసి ఆమెను పరామర్శించారు. కష్టకాలంలో ఆమెకు, ఆమె కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సంతాపం తెలియజేశారు.
1991లో పీటీ ఉష, శ్రీనివాసన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాసన్ నిరంతరం ఉషకు మద్దతుగా నిలిచారు. ఆమె క్రీడా, రాజకీయ జీవితంలో నిరంతరం పక్కనే ఉండి ప్రోత్సహించేవారు.