IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత.. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర్ నమోదు

భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది.

Team india

IND vs BAN 3rd T20 Match: బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డారు. సంజూ శాంసన్ ఎనిమిది సిక్సులు, 11 ఫోర్లతో 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఐదు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో 35 బంతుల్లో 75 పరుగులు చేశాడు. రియాన పరాగ్ 34, హార్దిక్ పాండ్య 47 పరుగులతో రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు భారీ స్కోర్ చేసింది.

Also Read: IND vs BAN : భారత్ దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు.. టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్..!

భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకిదిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. బంగ్లా బ్యాటర్లలో హిర్దోయ్ 63 నాటౌట్, లిటన్ దాస్ 42 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టలేక పోయారు. దీంతో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ జట్టు 133 పరుగుల భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: Ajay Jadeja : 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్.. ఈ రాజ సింహాసనానికి వారసుడు.. జామ్ సాహెబ్‌గా ప్రకటన

భారత్ జట్టు ఈ మ్యాచ్ లో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఆసియా గేమ్స్ లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో నేపాల్ జట్టు 314 పరుగులు చేసింది. నేపాల్ తరువాత 297 పరుగులతో టీమిండియా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే, టెస్టు క్రికెట్ ఆడే జట్లలో.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.