ఓవల్‌లో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఓవల్‌లో జరిగిన ఆఖరి టెస్టులో చివరి రోజు ఇంగ్లాండ్‌కు విజయం కోసం 35 పరుగులు కావాల్సి ఉండగా, 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు కోల్పోయింది. ఐదవ టెస్ట్‌లో సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ 30.1 ఓవర్లలో 104 పరుగులకుగాను 5 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 27 ఓవర్లలో 126 పరుగులకుగాను నలుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఔట్ చేశాడు.
ఓవల్‌లో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడంతో.. టెస్టు చరిత్రలో భారత్‌కు అత్యల్ప పరుగులతో దక్కిన విజయంగా ఇది నిలిచింది. అంతకుముందు టెస్టుల్లో 2004లో ముంబై వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాపై ఇండియా 13 పరుగుల తేడాతో గెలిచింది.
అత్యల్ప పరుగులతో భారత్ విజయం.. ఏయే జట్లపై, ఎప్పుడు?
తేడా | లక్ష్యం | ప్రత్యర్థి జట్టు | వేదిక | సంవత్సరం |
---|---|---|---|---|
6 రన్స్ | 374 | ఇంగ్లాండ్ | ఓవల్ | 2025 |
13 | 107 | ఆస్ట్రేలియా | ముంబై (వాంఖడే) | 2004 |
28 | 192 | ఇంగ్లాండ్ | కోల్‌కతా | 1972 |
31 | 323 | ఆస్ట్రేలియా | అడిలైడ్ | 2018 |
37 | 313 | వెస్టిండీస్ | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | 2002 |
49 | 269 | వెస్టిండీస్ | కింగ్స్‌టన్ | 2006 |
59 | 143 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 1981 |
60 | 188 | న్యూజిలాండ్ | ముంబై (బ్రాబోర్న్) | 1969 |
63 | 326 | వెస్టిండీస్ | కింగ్స్‌టన్ | 2011 |
63 | 241 | దక్షిణాఫ్రికా | జోహన్నెస్‌బర్గ్ | 2018 |
టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు సందర్భాల్లో జట్లు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాయి. మొదటి సారి 1993 జనవరి 23 నుంచి 26 వరకు అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్‌లో జరిగింది. వెస్టిండీస్ ఒక్క పరుగుతో గెలిచింది. రెండవసారి 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య వెలింగ్టన్‌లో జరిగింది. న్యూజిలాండ్ ఒక్క పరుగుతో విజయం సాధించింది.
అత్యల్ప పరుగుల తేడాతో విజయం సాధించిన జట్లు
విజేత | తేడా | లక్ష్యం | ప్రత్యర్థి | వేదిక | సంవత్సరం |
---|---|---|---|---|---|
వెస్టిండీస్ | 1 రన్ | 186 | ఆస్ట్రేలియా | అడిలైడ్ | 1993 |
న్యూజిలాండ్ | 1 | 258 | ఇంగ్లాండ్ | వెలింగ్టన్ | 2023 |
ఇంగ్లాండ్ | 2 | 282 | ఆస్ట్రేలియా | బర్మింగ్‌హామ్ | 2005 |
ఆస్ట్రేలియా | 3 | 124 | ఇంగ్లాండ్ | మాంచెస్టర్ | 1902 |
ఇంగ్లాండ్ | 3 | 292 | ఆస్ట్రేలియా | మెల్బోర్న్ | 1982 |
న్యూజిలాండ్ | 4 | 176 | పాకిస్థాన్ | అబూ దాబీ | 2018 |
దక్షిణాఫ్రికా | 5 | 117 | ఆస్ట్రేలియా | సిడ్నీ | 1994 |
ఆస్ట్రేలియా | 6 | 214 | ఇంగ్లాండ్ | సిడ్నీ | 1885 |
ఇండియా | 6 | 374 | ఇంగ్లాండ్ | ఓవల్ | 2025 |