ICC T20 : భారత్ – పాక్ మ్యాచ్.. రాజధర్మానికి విరుద్ధం – బాబా రామ్‌దేవ్‌

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ వేదికగా భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ICC T20 : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులు భారత్ విజయం సాధించాలని పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే యోగ గురువు రాందేవ్ బాబా.. భారత్ – పాక్‌తో క్రికెట్ ఆడటాన్ని తప్పుబట్టారు. ఇది రాజధర్మానికి విరుద్ధమని అభివర్ణించారు.

చదవండి : Ramdev Vs Doctors : సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాందేవ్ బాబా

శనివారం మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిర్ పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ‘పాకిస్థాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితిలో క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజధర్మానికి వ్యతిరేకం. ఇది దేశ ప్రయోజనాల కోసం కాదు. క్రికెట్ ఆట, టెర్రర్ గేమ్‌ని ఒకేసారి ఆడలేం’ అని అన్నారు.

చదవండి : Baba Ramdev: బాబా రాందేవ్ పై పోలీస్ కేసు

ఇక పెట్రోల్ రేట్ల పెరుగుదలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. పెట్రోల్ ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా ఉందని అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తే పెట్రోల్ రేట్లు తగ్గించొచ్చని తెలిపారు. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధర ఉండాలన్నారు. తక్కువ పన్ను విధించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక డ్రగ్స్ విషయంపై మాట్లాడుతూ ఇది దేశ యువతకు చాలా ప్రమాదకరమని అన్నారు. ఈ గందరగోళం నుంచి చిత్ర పరిశ్రమను క్లియర్ చేయాలి’ అని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు