INDw vs SLW 5th T20 Shafali Verma need 75 runs to most runs in a womens t20 series (PIC Credit@BCCIWomen)
Shafali Verma : భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు (మంగళవారం డిసెంబర్ 30) ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma ) ను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఒకవేళ షపాలీ ఈ మ్యాచ్‌లో 75 పరుగులు సాధిస్తే ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంటుంది.
మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఆమె వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ హేలీ మాథ్యూస్‌ను అధిగమిస్తుంది. ఓ టీ20 సిరీస్‌లో మాథ్యూస్ 310 పరుగులు చేసింది. లంకతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో షపాలీ 236 పరుగులు సాధించింది.
వాస్తవానికి తొలి మ్యాచ్‌లో 9 పరుగులకే షపాలీ ఔట్ అయింది. అయితే.. ఆ తరువాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగింది. వరుసగా 69*, 79*, 79 పరుగులు సాధించింది.
మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) – 3 మ్యాచ్‌ల్లో 310 పరుగులు
* చమరి ఆటపట్టు (శ్రీలంక) – 5 మ్యాచ్‌ల్లో 304 పరుగులు
* మరియా కాస్టినేరాస్ (అర్జెంటీనా) – 3 మ్యాచ్‌ల్లో 300 పరుగులు
* సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 4 మ్యాచ్‌ల్లో 297 పరుగులు