T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ఇదేం ట్విస్ట్ రా సామీ..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
England announced 15 member squad for T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026కి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు తమ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే హ్యారీ బ్రూక్ నాయకత్వంలోనే ఇంగ్లాండ్ ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది.
ఇక పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో బాధపడుతున్నప్పటికి కూడా అతడికి 15 మంది సభ్యులతో కూడిన బృందంలో చోటు దక్కింది. ఈ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్ లేకుండా మిగిలిన జట్టు అంతా కూడా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బ్రైడాన్ కార్స్‌ను శ్రీలంక సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు.
Gujarat Giants : గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా ఆష్లీ గార్డనర్..
Bring it on! 🔥
Our provisional 15-strong squad for the Men’s T20 World Cup in India and Sri Lanka 💪 pic.twitter.com/KFKGwOZC20
— England Cricket (@englandcricket) December 30, 2025
ఒక వేళ మెగాటోర్నీ సమయానికి ఆర్చర్ కోలుకోకపోతే అతడి స్థానంలో బ్రైడాన్ కార్స్ ఆడనున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్ , బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇదే..
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, బ్రైడాన్ కార్స్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్
