Injury scare for Team India ahead of Womens ODI World Cup 2025
Team India : సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీకి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో భారత్ (Team India)కు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా పేసర్ అరుంధతి రెడ్డి గాయపడింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె ప్రపంచకప్‌లో పాల్గొనడం పై సందిగ్ధం నెలకొంది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను అరుంధతి రెడ్డి వేసింది. ఈ ఓవర్‌లోని ఓ బంతిని హైదర్ నైట్ షాట్ ఆడగా.. రిటర్న్ క్యాచ్ అందుకునేందుకు అరుంధతి రెడ్డి ప్రయత్నించింది. అయితే.. బంతి ఆమె ఎడమకాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రవైన నొప్పితో ఆమె విలవిలలాడింది. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో వీల్‌ఛైర్‌లో ఆమె మైదానాన్ని వీడింది.
A freak accident in the #INDvENG warm-up clash has forced Arundhati Reddy off the field just ahead of #CWC25.
Read more ➡️ https://t.co/lyVsKwHOca pic.twitter.com/OQ0ktOX40p
— ICC (@ICC) September 25, 2025
ఆమె గాయం తీవ్రత పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ గాయం తీవ్రమైనది అయిన ప్రపంచకప్‌కు ఆమె దూరం అయితే మాత్రం అది టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
ఇక వార్మప్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ నాట్ సీవర్ (120) సెంచరీతో కదంతొక్కగా ఎమ్మా లాంబ్ (84) హాఫ్ సెంచరీ బాదింది. టీమ్ఇండియా బౌలర్లలో క్రాంతి గౌడ్ మూడు వికెట్లు తీసింది.
Jaker Ali : అందుకే పాక్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. బంగ్లాదేశ్ కెప్టెన్ జాకీర్ అలీ కామెంట్స్..
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 34 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడిగ్ర్స్ (66), ఉమా చెత్రి (45) మినహా మిగిలిన వారు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌కు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు దూరంగా ఉన్నారు. హర్మన్ లేకపోవడంతో జెమీమా రోడిగ్రస్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించింది.