Virat Kohli son Akaay : ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ అయిన విరాట్ కొడుకు.. 24గంటల్లో ఏం జరిగిందో తెలుసా?

అకాయ్ పేరును కోహ్లీ వెల్లడించిన 24గంటల వ్యవధిలోనే ఇన్ స్టాగ్రామ్ లో ‘అకాయ్ కోహ్లీ’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.

Virat Kohli son Akaay : విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ కొడుకు సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ఈనెల 15న అనుష్క శర్మ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ నవజాత శిశువుకు ఆకాయ్ అని పేరుసైతం పెట్టేశారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో విరాట్, అనుష్క దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు వారి అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తింది.

Also Read : IND vs ENG : నాల్గో టెస్ట్ కోసం టీమిండియాలో కీలక మార్పులు.. రోహిత్ తరువాత ఎవరు?

మరోవైపు, అకాయ్ పేరును కోహ్లీ వెల్లడించిన 24గంటల వ్యవధిలోనే ఇన్ స్టాగ్రామ్ లో ‘అకాయ్ కోహ్లీ’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. చాలా ఖాతాలు విరాట్, అనుష్క, వారి కుమార్తె వామికా కోహ్లీతో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు. ఇన్ స్టాగ్రామ్ లో akkay kohli అని సర్చ్ చేస్తే ఆ పేరుతో అనేక సంఖ్యలో ఖాతాలు కనిపిస్తున్నాయి. దీంతో కొందరు వినియోగదారులు ఆసక్తికరంగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ప్రజలు అంత పనిలేకుండా ఎలా ఉంటున్నారు.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. మరో వినియోగదారుడు ఇది చాలా గగుర్బాటు కలిగించే విషయం. ఆ శిశువు వయస్సు కేవలం ఐదు రోజులు మాత్రమే.. అభిమానులు అతనికోసం సోషల్ మీడియాలో ఇలా నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు