IPL 2020 ఫుల్ షెడ్యూల్ ఇదే..
- Subhan Ali Shaik
- Published On : February 16, 2020 / 06:53 AM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ పక్కకు బెట్టి ముందుగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ప్రకటించిన మార్చి 29నే తేదీ నుంచి టోర్నీ మొదలుపెట్టనున్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్‌ల వివరాలను మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు. లీగ్ దశ మే 17తో పూర్తవుతుంది. ఫైనల్ మ్యాచ్ కచ్చితంగా మే 24న జరుగుతుంది.
గతంలో శనివారం, ఆదివారం రెండేసి మ్యాచ్‌లు చొప్పున జరిగేవి. వాటిని కేవలం ఆదివారానికే పరిమితం చేశారు. గత సంవత్సరం వరకూ 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా ఆరు రోజులు పొడిగించారు.
రాజస్తాన్ మినహా మిగిలిన ఐపీఎల్ జట్లన్నీ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్‌తో పాటు రెండు మ్యాచ్‌లను అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్‌గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో వేసిన కేసు విచారణలోనే ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో హైదరాబాద్‌కు బయట ఆడనుంది సన్‌రైజర్స్.
#IPL2020 schedule ❤? pic.twitter.com/bOsEvypclR
— VIVO IPL 2020 (@IPLCricket) February 15, 2020
Read More>> కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు
