IPL 2020 Auction : హనుమ విహారి Unsold

ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ.10.75 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
ఇక ఇంగ్లండ్ ప్లేయర్ మోర్గాన్ ను రూ.5.25 కోట్లకు కోల్ కతా దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ను రూ.4.4 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. క్రిస్ లిన్ ను రూ.2కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక భారత క్రికెటర్ రాబిన్ ఊతప్పను రూ.3 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
కాగా.. కొందరు క్రికెటర్లు అన్ సోల్డ్ జాబితాలో ఉండిపోయారు. వారిని కొనుగోలు చేయడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అన్ సోల్డ్ లిస్ట్ లో మన తెలుగువాడు ఉన్నాడు. క్రికెటర్ హనుమ విహారిని ఏ జట్టు పట్టించుకోలేదు. హనుమ విహారి బేస్ ప్రైస్ రూ.50లక్షలు. మరో స్టార్ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాకి కూడా చేదు అనుభవమే ఎదురైంది.
విహారితో పాటు చతేశ్వర్ పుజారా కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. పుజారా బేస్ ప్రైస్ రూ.50లక్షలు. యూసుఫ్ పఠాన్, గ్రాండ్ హోమ్, స్టువర్ట్ బిన్నీల పేర్లు అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నాయి. పఠాన్ బేస్ ప్రైస్ కోటి రూపాయలు, గ్రాండ్ హోమ్ బేస్ ప్రైస్ 75లక్షలు, బిన్నీ బేస్ ప్రైస్ రూ.50లక్షలు.
తెలుగు క్రికెటర్ హనుమ విహారిని ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోకవపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువాడికి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ లో ఉన్నారు. గతేడాది ఢిల్లీ కేపిటల్స్ విహారిని కొనుగోలు చేయగా.. ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది.
IPL 2020 క్రికెటర్ల వేలం:
* పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) ను రూ.15.50 కోట్లకు దక్కించుకున్న కోల్ కతా
* క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) ను రూ.2కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
* మోర్గాన్(ఇంగ్లండ్) ను రూ.5.25 కోట్లకు దక్కించుకున్న కోల్ కతా
* రాబిన్ ఊతప్ప(భారత్)ను రూ.3 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్
* జాసన్ రాయ్(ఇంగ్లండ్) ను రూ.1.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ
* ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) ను రూ.4.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు
* మ్యాక్స్ వెల్(ఆస్ట్రేలియా) ను రూ.10.75 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
* క్రిస్ వోక్స్(ఇంగ్లండ్) ను రూ.1.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ