CSK ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రదర్శనపై కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు. మూడు సార్లు టైటిల్ విజేత అయిన ఛాంపియన్స్ పరిస్థితి ఈ సారి ప్లే ఆఫ్‌లో నిలుస్తుందా అనే అనుమానం మొదలైంది. ఆడిన 7మ్యాచ్ లలో 2మాత్రమే గెలిచింది.
CSK ప్రధాన సమస్య ఏంటంటే.. బ్యాటింగే అని కోచ్ అంటున్నాడు. సురేశ్ రైనా జట్టులో లేకపోవడంతో మిడిలార్డర్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. టార్గెట్ చేధనలో పరుగులు సరిగ్గా చేయలేకపోతున్నారు. CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమస్యల గురించి మాట్లాడుతూ.. జట్టులో వయస్సు అయిపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని అన్నాడు.
39 సంవత్సరాల వయస్సున్న మహేంద్ర సింగ్ ధోనీ.. జట్టులో ప్లేయర్ల యావరేజ్ వయస్సు 30గా ఉంది. ఈ లీగ్ ను చాలా సార్లు డాడ్ ఆర్మీ అని కూడా పిలిచారు.
‘ఇద్దరు విదేశీ ప్లేయర్లతో కూడా మంచి ఆరంభం లభించకపోతే మేం సమస్యలో పడిపోయినట్లే. పాజిటివ్ సొల్యూషన్స్ కోసం వెదుకుతున్నాం. మిడిల్ ఓవర్లలో ఇంకొంచెం ప్రదర్శన రావాలని ఆశిస్తున్నా’ అని ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఫ్లెమింగ్ అన్నారు.
‘బ్యాటింగ్ చేయడానికి జట్టులో చాలా మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. హిట్టర్లకు ఫ్రీడం ఇస్తున్నాం. ఇలాగే ఆడుతూ ఉంటే ప్లేఆఫ్ బరిలో ఉండటం కష్టమే అని నమ్ముతున్నట్లు ఫ్లెమింగ్ అన్నాడు.
ఇంకా కారణాలు చెప్పాలంటే జట్టులో వయస్సు ఎక్కువ వాళ్లే ఉన్నారు. స్పిన్నర్లు చాలా తక్కువ పాత్ర పోషిస్తున్నారు. ఆటతీరు మార్చాలనుకుంటున్నాం. విదేశీ ప్లేయర్ల ప్రభావం కూడా కాస్త కనిపిస్తుంది’
‘ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి మ్యాచ్ లో లక్ష్యాన్ని చేధించడానికి బాగానే ప్రయత్నిస్తున్నాం. ఒకసారి వికెట్లు చేజారిపోయాక అదంత సులువైన విషయం కాదు. మరింత కమిట్మెంట్ తో ఆడతారని అనుకుంటున్నాం. స్వింగింగ్ మాత్రమే ఉంటే సరిపోదు. బౌలింగ్ లోనూ కొన్ని ఛాలెంజింగ్ లు ఉన్నాయి’ అని ఫ్లెమింగ్ అన్నాడు.