IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చెన్నై 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆల్ రౌండ్ షో‌తో అదరగొట్టిన ధోని సేన..

IPL 2021 Final : ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చెన్నై 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆల్ రౌండ్ షో‌తో అదరగొట్టిన ధోని సేన.. టోర్నీ విజేతగా నిలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) వికెట్‌కీపర్‌ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడాడు.

తెలుగు ఐపీఎల్ క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చెన్నైతో మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (Star Sports 1 Telugu) ఛానెల్ కోసం దినేష్ కార్తీక్ మాట్లాడాడు. కొంచెం కూడా తడబాటు లేకుండా అచ్చ తెలుగులో స్సష్టంగా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలుగువాడైన యాంకర్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి అందరిని అబ్బరపరిచాడు.

మెగా ఫైనల్‌ ఒత్తిడి ఉందా అని హర్షా అడిగిన ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నాడు. సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌ను భావిస్తున్నామంటూ తడబడకుండా టక్కున తెలుగులో చెప్పేశాడు. ఫైనల్ మ్యాచ్‌ అనగానే.. ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామన్నాడు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని తెలిపాడు. ఫైనల్‌కు చేరేందుకు కేకేఆర్ ఆటగాళ్లు బాగా కష్టపడ్డారని దినేశ్ చెప్పుకొచ్చాడు.
IPL 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నాలుగోసారి..


దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటంపై తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. 2020 ఐపీఎల్‌ లో కూడా దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు.
IPL Winners: ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు.. పూర్తి వివరాలు ఇవే!

ట్రెండింగ్ వార్తలు