IPL Winners: ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు.. పూర్తి వివరాలు ఇవే!

రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

IPL Winners: ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు.. పూర్తి వివరాలు ఇవే!

Champions (2)

IPL Winners list: రెండు భాగాలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఎట్టకేలకు ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. రేపు(15 అక్టోబర్ 2021) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. IPL 2021 ఫైనల్‌కు ముందు.. ఇప్పటివరకు ఏ జట్టు ఐపీఎల్ టైటిల్‌లను గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ముంబై జట్టు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈసారి మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, సీజన్ ప్లే-ఆఫ్‌లోకి కూడా రాలేకపోయింది. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటివరకు మూడు సార్లు ఐపిఎల్ టైటిల్ గెలిచుకుంది ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉండగా.. రెండుసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ట్రోఫీని గెలుచుకుని మూడో స్థానంలో ఉంది.

ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని గెలవని టీమ్‌ల విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన జట్లు కనీసం ఒక టైటిల్‌ని గెలుచుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మూడు జట్లు ఫైనల్ రేసులో లేవు.

ఇటువంటి పరిస్థితిలో 14వ సీజన్ కూడా ఇప్పటికే గెలిచిన జట్లలో ఒకటి ఐపీఎల్ గెలిచే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు ఈ టోర్నమెంట్‌లో చేరనుండగా.. ఈ ఏడాది ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఉన్నాయి.

ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న జట్లు:

Year IPL Winners
2008 Rajasthan Royals
2009 Deccan Chargers
2010 Chennai Super Kings
2011 Chennai Super Kings
2012 Kolkata Knight Riders
2013 Mumbai Indians
2014 Kolkata Knight Riders
2015 Mumbai Indians
2016 Sunrisers Hyderabad
2017 Mumbai Indians
2018 Chennai Super Kings
2019 Mumbai Indians
2020 Mumbai Indians
2021  ?

పూర్తి వివరాలు:

Year Winner Runner Up Venue Number of teams Player of the Match
2020 Mumbai Indians Delhi Capitals Dubai 8 Trent Boult
2019 Mumbai Indians Chennai Super Kings Hyderabad 8 Jasprit Bumrah
2018 Chennai Super Kings Sunrisers Hyderabad Mumbai 8 Shane Watson
2017 Mumbai Indians Rising Pune Supergiants Hyderabad 8 Krunal Pandya
2016 Sunrisers Hyderabad Royal Challengers Bangalore Bangalore 8 Ben Cutting
2015 Mumbai Indians Chennai Super Kings Kolkata 8 Rohit Sharma
2014 Kolkata Knight Riders Kings XI Punjab Bangalore 8 Manish Pandey
2013 Mumbai Indians Chennai Super Kings Kolkata 9 Kieron Pollard
2012 Kolkata Knight Riders Chennai Super Kings Chennai 9 Manvinder Bisla
2011 Chennai Super Kings Royal Challengers Bangalore Chennai 10 Murali Vijay
2010 Chennai Super Kings Mumbai Indians Mumbai 8 Suresh Raina
2009 Deccan Chargers Royal Challengers Bangalore Johhanesburg 8 Anil Kumble
2008 Rajasthan Royals Chennai Super Kings Mumbai 8 Yusuf Pathan