కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు మారింది.. ‘పంజాబ్ కింగ్స్’

Kings XI rename Punjab Kings Ahead Of Season IPL 2021 : ఐపీఎల్ ప్రాంఛైజీ కింగ్ ఎలెవన్ పంజాబ్ పేరు మార్చుకుంది. ఐపీఎల్ 14వ సీజన్ కు ముందుగానే ఎలెవన్ జట్టు ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. పంజాబ్ కింగ్స్ బ్రాండ్, లోగోను ఫ్రాంచైజీ ప్రకటించింది. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది.

పంజాబ్ కింగ్స్ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఆ ఫ్రాంచైజీ సీఈఓ సతీశ్ మీనన్ ఆవిష్కరించినట్టు పత్రిక ప్రకటనలో వెల్లడించారు. ఇదే విషయాన్ని బీసీసీఐకి కూడా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలియజేసింది. బోర్డు నుంచి పంజాబ్ జట్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. పంజాబ్ కింగ్స్ బ్రాండ్ ఐడెంటిటీతో ముందుకొస్తున్నామని, కోర్ బ్రాండ్ పై దృష్టిపెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు సీఈఓ సతీశ్ పేర్కొన్నారు.

బ్రాండ్ ఐడెంటిటీలో పేరు మాత్రమే మారిందని.. అసలైన బ్రాండ్ అలానే కొనసాగుతుందని అన్నారు. కొత్త లోగోతో వచ్చే సీజన్ లో ఇతర జట్లతో పోటీగా నిలబడేందుకు రెడీ అవుతున్నామని జట్టు ఆకాంక్షించింది. ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ వేలంలో ‘పంజాబ్ కింగ్స్’ పేరుతోనే బరిలోకి దిగనుంది.