IPL 2021 KKR Vs DC : కోల్‌కతా టార్గెట్ 128

ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర

IPL 2021 KKR Vs DC : ఐపీఎల్ 2021 సీజన్ 2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్‌ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

స్టీవ్‌ స్మిత్‌(39.. 34 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (39.. 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. 5వ ఓవర్‌లో ఢిల్లీ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(24.. 20 బంతుల్లో 5 ఫోర్లు)ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(1)ని సునీల్‌ నరైన్‌ పెవిలియన్ చేర్చాడు. ప్రమాదకరంగా మారుతున్న స్మిత్‌ని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. హెట్‌మయర్ (4), లలిత్‌ యాదవ్‌(0), అక్షర్ పటేల్‌(0), అశ్విన్‌(9) నిరాశపరిచారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సౌథీ ఒక వికెట్ తీశాడు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

ఐపీఎల్ రెండో దశలో మోర్గాన్‌ టీమ్‌ రెండు విజయాలు సాధించి జోరుమీదున్నట్లు కనిపించినా గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరిన ఢిల్లీ టీమ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు