Mumbai
Mumbai Indians VS Rajasthan Royals : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. ఉత్కంఠ భరింతగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం నాడు రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ లలో రోహిత్ శర్మ (14) నిరాశపరిచినా..డికాక్ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం. కృనాల్ 39 పరుగులు చేసి చక్కటి సహకారం అందించాడు. మధ్యలో వచ్చిన యాదవ్ 16, పాండ్యా 39 పరుగులు చేసి వెనుదిరిగారు. 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1 వికెట్ తీశాడు.
రాజస్థాన్ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ 42 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బట్లర్ 41, దూబే 35, జైస్వాల్ 32 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి…171 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్ తీశారు.
Read More : IN Registration : వన్ నేషన్ వన్ పర్మిట్..దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు