IPL 2022: 19ఏళ్ల రాజవర్ధన్‌కు రూ.1.5కోట్లు వెచ్చించిన సీఎస్కే

మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19

Csk

IPL 2022: మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19 క్రికెటర్ రాజ్యవర్ధన్ హంగర్గేకర్ కూడా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దాదాపు రూ.1.5కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

కనీస ధర రూ.30లక్షలకు వేలంలోకి వచ్చిన రాజ్‌వర్ధన్ కోసం ఐదు సార్లు టైటిల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ పోటీ పడింది. లక్నో సూపర్ జయింట్స్ ను దాటి సీఎస్కే సొంతం చేసుకుంది. అలా ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ అరంగ్రేటానికి మంచి డిమాండ్ వచ్చింది.

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన రాజ్యవర్ధన్ 2020-21 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడాడు. ఆ తర్వాత ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022లోనూ మెరిశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వికెట్ పడగొట్టలేకపోయినా 147కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఐర్లాండ్ తో జరిగిన గేమ్ లో అజేయంగా 37 పరుగులు చేయగలిగాడు.

Read Also: ధోనీ ఒక్క రూపాయి కూడా తీసుకోడు – దీపక్ చాహర్