Ipl 2022 Csk Vs Kkr
IPL2022 CSK Vs KKR : ఈ సమ్మర్ లో క్రికెట్ లవర్స్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. ఐపీఎల్ 15వ సీజన్ శనివారం(మార్చి 26,2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడుతున్నాయి. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహించనున్నారు. కాగా కోల్ కతా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.(IPL2022 CSK Vs KKR)
ఆటగాళ్లను తరలించే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఈ గ్రీన్ కారిడార్లు హెల్ప్ అవుతాయి. ఇందుకోసం వెయ్యి మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతి జట్టుకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. అదే సమయంలో, సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వారిని ఇతర మార్గాల్లోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్ లో ఐపీఎల్ ను టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తోంది.
శనివారం నుంచి ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో భారీ మార్పులు వచ్చాయి. కొత్తగా రెండు జట్లు ఈ టోర్నీలోకి అడుగుపెట్టనుండగా.. కొంతమంది ఆటగాళ్లు జట్లు మారారు, జట్ల కెప్టెన్లు మారారు. ఇటు చెన్నై, అటు కోల్‌కతా ఇరు జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. గత సీజన్‌లో కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్‌ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్ ధోని కూడా అనూహ్య నిర్ణయం తీసుకుని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.
ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మినహా చెన్నై జట్టులో పెద్ద ఇబ్బందులేవీ లేవు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన చెన్నై.. ఈసారి కూడా అదే ఉత్సాహంతో మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ జట్టులో దాదాపు అందరూ పాత ఆటగాళ్లే ఉండటం కలిసొచ్చే అంశం.
IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే
చెన్నై జట్టులాగే కోల్‌కతా కూడా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో దుబాయ్ వేదికగా జరిగిన మలి దశ ఐపీఎల్‌లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన కోల్‌కతా జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈసారి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగింది. గతంలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్.. ఆ జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లాడు. అయితే, ముంబైలో జరిగిన తుదిపోరులో ఢిల్లీ ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.
శ్రేయస్‌కు కెప్టెన్సీ అనుభవంతో పాటు.. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, గత సీజన్‌లో గొప్పగా రాణించిన వెంకటేశ్ అయ్యర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటాడు. వీరితో పాటు నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్‌లతో పాటు.. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ వంటి ఆల్ రౌండర్లు ఉండటం కేకేఆర్‌కు సానుకూల అంశం. పాట్ కమ్మిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, చమిక కరుణరత్నెలతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ నబి వంటి స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు.