IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్​లు భారత్‌లోనే

రెండేళ్ల తరువాత మ్యాచ్ లు పూర్తిగా భారత్ లోనే జరుగుతున్నాయి. ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అన్ని లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు.

IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్​లు భారత్‌లోనే

Ipl Season 15

IPL-2022 Matches : ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్​పండగకు వేళైంది. ఇండియన్​ ప్రీమియర్​లీగ్ 15వ సీజన్​ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్ ​సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. కరోనా కారణంగా టోర్నీ చివరి సగం మ్యాచ్‌లను గతేడాది యూఏఈలో నిర్వహించగా.. ఈసారి మాత్రం అన్ని మ్యాచ్​లు భారత్‌లోనే జరగనున్నాయి. డిఫెండింగ్​ ఛాంపియన్​చెన్నై సూపర్​కింగ్స్, రన్నరప్​కోల్‌కతా నైట్​రైడర్స్​మధ్య తొలిమ్యాచ్ ​ఇవాళ రాత్రి 7.30కి జరగనుంది.

ముంబై వేదికగా తొలి సమరం జరగనుంది. 25 శాతం మంది ప్రేక్షకులకే మైదానాల్లోకి అనుమతి ఉంది. రెండేళ్ల తరువాత మ్యాచ్ లు పూర్తిగా భారత్ లోనే జరుగుతున్నాయి. ముంబై లో మూడు, పూణేలో ఒక మైదానంలో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అన్ని లీగ్ మ్యాచ్ లు ముంబై, పూణే లోనే నిర్వహిస్తారు. ఈ సీజన్ లో 10 జట్లు పోటీ పడుతున్నాయి.

Jio IPL Plans 2022 : ఐపీఎల్ 2022 కోసం జియో సరికొత్త ప్లాన్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ చూడొచ్చు..!

నిర్వాహకులు 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీ,లక్నో జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనళ్ల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీలో భారీ మార్పులు వచ్చాయి.

ఇటు చెన్నై, అటు కోల్‌కతా ఇరు జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. గత సీజన్‌లో కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్‌ మోర్గాన్‌ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్‌ ధోని కూడా అనూహ్య నిర్ణయం తీసుకుని ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.

IPL 2022 : ఐపీఎల్‌-2022లో ఇక ఆ ప్రకటనలు ఉండవట.. ఎందుకో తెలుసా?

ఇప్పటివరకు కోల్‌కతా జట్టుపై చెన్నైకి గొప్ప రికార్డు ఉంది. ఈ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 17 మ్యాచుల్లో చెన్నై, 8 మ్యాచుల్లో కోల్‌కతా గెలుపొందాయి. మరో మ్యాచులో ఫలితం తేలలేదు. ఇదిలా ఉండగా, గత సీజన్‌లో మొత్తం మూడు సార్లు ఇరు జట్లు తలపడగా.. మూడింట్లోనూ చెన్నై పైచేయి సాధించింది.