Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

Watch IPL 2022 Live Matches : ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మెగా టోర్నీ మొదలుకాబోతోంది.

Watch IPL 2022 Live Matches : భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఇలా చూడొచ్చు..!

Watch IPL 2022 Live Matches : ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మెగా టోర్నీ మొదలుకాబోతోంది. ఐపీఎల్ 10 ప్రాంచైజీ జట్లు తమ సీజన్ ఒక్కొక్కటిగా ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి. మార్చి 26 (శనివారం) ఈరోజు సాయంత్రం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ టోర్నీ కిక్ స్టార్ట్ కానుంది. ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగనున్నాయి. అయితే.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లు చూడాలంటే ఎలా? మునపటిలా స్టేడియం వెళ్లి చూసే పరిస్థితి లేదు. ఉన్నచోట నుంచే ఆన్‌లైన్‌లో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ మ్యాచ్ చూడలేమా? అంటే.. చూడొచ్చు.. IPL 2022 ప్రారంభ మ్యాచ్‌ల్లో మొత్తం గ్రూప్ దశలో మహారాష్ట్రలో ముంబై, నవీ ముంబై పూణే (వాంఖడే, బ్రబౌర్న్, DY పాటిల్ MCA స్టేడియం) అంతటా నాలుగు వేదికలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మీరు స్టేడియంకు వెళ్లి చూసే పరిస్థితి లేని ఐపీఎల్ అభిమానులు ఇంట్లోనే కూర్చొని IPL 2022 లైవ్ మ్యాచ్ లను ఆన్‌లైన్‌లోనే చూసేయొచ్చు..

ఈ ఏడాది ఐపీఎల్ టాటా IPL 2022గా పిలుస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరాయి. అందులో ఒకటి.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రెండోది గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు.. KL రాహుల్, హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఈ రెండు జట్లు సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు పలకడంతో.. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బరిలోకి దిగనుంది. గత ఏడాదిలో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో చెన్నై జట్టు ఈరోజు తొలి మ్యాచ్‌తో సీజన్ ఆరంభించనుంది.

Read Also : IPL 2022 : ఐపీఎల్‌-2022లో ఇక ఆ ప్రకటనలు ఉండవట.. ఎందుకో తెలుసా?

Watch IPL 2022 Live Matches : ఇండియాలో IPL 2022 Matches ఆన్‌లైన్‌లో ఎలా చూడాలంటే? :
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఇండియా IPL 2022 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామిగా ఉంది. భారత్‌లో IPL చాలా సులభంగా చూడాలంటే.. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది ప్లాన్ రూ. 499 చెల్లిస్తే చాలు.. ఇక ఇతర టెలికం దిగ్గజాలైన Reliance Jio , Vi, Airtel కంపెనీలు కూడా తమ యూజర్ల కోసం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మెంబర్‌షిప్‌లతో కూడిన ప్రత్యేక క్రికెట్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మొబైల్‌లో IPL 2022 వీక్షించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్ (Disney+ Hotstar Super subscription) తప్పనిసరిగా ఉండాలి. రూ. 899లకే ఈ ఏడాది ప్లాన్ అందుబాటులో ఉంది. మీరు మొబైల్, టీవీ, డెస్క్‌టాప్‌లో Disney+ Hotstar యాప్‌ ద్వారా ఎక్కడైనా IPL లైవ్ మ్యాచ్ లు చూసేయొచ్చు. కుటుంబమంతా కలిసి ఐపీఎల్ మ్యాచ్ లను చూడాలంటే.. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. దీని ధర ఏడాదికి రూ. 1,499, లేదంటే రూ. నెలకు 299 ప్లాన్ కూడా ఉంది. IPL 2022 కు సంబంధించి సూపర్‌పై మీకు ఎలాంటి అదనపు బెనిఫిట్స్ పొందలేరు. కానీ, ఈ ప్లాన్లపై రెండు స్క్రీన్‌లకు బదులుగా నాలుగు స్క్రీన్‌లపై ఒకే సమయంలో ఎక్కువ మంది వీక్షించవచ్చు.

Watch Ipl 2022 Live Matches How To Watch Ipl 2022 Matches Online In India, Us, And Around The World (1)

Watch Ipl 2022 Live Matches How To Watch Ipl 2022 Matches Online In India, Us, And Around The World

Watch IPL 2022 Live Matches : ఇతర దేశాల్లో IPL 2022 మ్యాచ్‌లను చూడాలంటే? :
మునుపటి సీజన్‌ల మాదిరిగానే.. YuppTV అనే స్ట్రీమింగ్ యాప్ సర్వీసు అందుబాటులో ఉంది. ఈ ఏడాది కూడా IPL సీజన్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ సర్వీసును అందిస్తోంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, జపాన్, అఫ్ఘానిస్తాన్ మరిన్ని దేశాలలోని క్రికెట్ అభిమానులు IPL 2022 మ్యాచ్‌లను ఈ ప్లాట్ ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. అమెరికాలోని క్రికెట్ అభిమానులు IPL గేమ్‌లను ఆన్‌లైన్‌లో చూడటానికి నెలకు $6.99 (దాదాపు రూ. 530) చెల్లించి ESPN+కి సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. డిస్నీ బండిల్‌ (Disney Bundle)లో భాగంగా ESPN+ ఛానల్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా, అమెరికాలోని విల్లో టీవీ (Willow TV) లైవ్‌స్ట్రీమింగ్ కేబుల్/శాటిలైట్ వాచింగ్ ఆప్షన్లన కూడా అందిస్తోంది.

ఇక, ఆస్ట్రేలియాలో, ఐపీఎల్ క్రికెట్ అభిమానులు లైవ్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఫాక్స్ స్పోర్ట్స్ (Fox Sports), కయో స్పోర్ట్స్ ( Kayo Sports) రెండింట్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఫాక్స్ స్పోర్ట్స్ సాధారణంగా టీవీ ప్యాకేజీలతో వస్తుంది. టీవీ ప్యాకేజీ లేని వినియోగదారులకు కయో స్పోర్ట్స్ బెస్ట్ ఆప్షన్.. AUD 25 (దాదాపు రూ. 1,400) నెలవారీ ప్రైమరీ ప్యాకేజీని అందిస్తోంది. అలాగే AUD 35 (దాదాపు రూ. 2,000) నెలకు ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ అందిస్తోంది. 14 రోజుల ట్రయల్ (14-day trial) ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన ప్లాట్ ఫాం ఎంచుకుని ఐపీఎల్ 2022 మ్యాచ్‌లకు చూసేయండి..

Read Also : Jio T20 Plans 2022 : జియో ఐపీఎల్ సరికొత్త ప్లాన్లు.. రివార్డులు.. డిస్నీ హాట్ స్టార్‌లో ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు చూడొచ్చు