IPL 2022 Final Match : ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. ఫైనల్ ఎక్కడంటే..

షెడ్యూల్‌ను కాస్త మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ప్ర‌క‌ట‌న చేశారు. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల‌ను గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్నారు.

Ipl 2022 Final Match

IPL 2022 Final Match : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) సీజన్ 15 ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ సీజ‌న్‌లో మ్యాచ్‌ల‌న్నింటినీ మ‌హారాష్ట్రలోని స్టేడియంలలోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా బీసీసీఐ గ‌తంలో ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ను కాస్తంత మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్లే ఆఫ్ మ్యాచ్‌ల‌ను గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌, ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్నారు.

IPL 2022 Final Match to be held at Narendra Modi Stadium on May 29

ఐపీఎల్ తాజా సీజన్‌లో ప్లే ఆఫ్ ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ మంగ‌ళ‌వారం ఈ ప్ర‌క‌ట‌న‌ జారీ చేసింది. ఈ సీజన్‌లో ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న టైటిల్ పోరును అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. అంత‌కు ముందే ఈ నెల 27న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌నూ ఇక్క‌డే నిర్వ‌హిస్తారు. ఇక కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్ (మే 24)తో పాటు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ (మే 25)ను నిర్వ‌హిస్తారు.

IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్

మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి. ముంబై, పుణె నగరాల్లోని నాలుగు మైదానాల్లో 65 రోజుల పాటు మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ – 15వ సీజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఆరంభమైంది. వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 26వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్‌ జరిగింది. గత సీజన్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌కు వచ్చాయి. కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లను ఆడుతుంది. మార్చి 27వ తేదీ నుంచి డబుల్‌ హెడ్డర్‌ (రోజుకు రెండు మ్యాచ్‌లు) ప్రారంభం అయ్యాయి. వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్, ఎంసీఏ మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్‌ 15వ సీజన్‌ మ్యాచ్‌లు మే 29న ఫైనల్ తో ముగుస్తాయి.