Deepak Chahar
IPL 2022: ఇండియా ఆల్-రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2022వేలంలో జాక్‌పాట్ కొట్టేశాడు. ప్రదర్శనకు పలికే ధర కొలమానం కాదని జట్టు కోసం ఎంత శ్రమిస్తున్నామనేదే ముఖ్యమని అంటున్నాడు. 2018 నుంచి ధోనీ నేతృత్వంలో నడుస్తున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లో ప్లేయర్. ఫిబ్రవరి 12న జరిగిన మెగా వేలం మొదటి రోజున రూ.14కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి దక్కించుకుంది.
రూ.2కోట్ల ప్రారంభ ధరతో మొదలైన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లు కొనుగోలు జరిపేందుకు ఆసక్తి చూపాయి. రాజస్థాన్ రాయల్స్ ఆలస్యంగా ముందుకురావడంతో అప్పటికే చెన్నై చాహర్ పై కర్చీఫ్ వేసేసింది. సూపర్ కింగ్స్ జట్టు ఎంత ప్రియారిటీ ఇచ్చిందంటే కెప్టెన్ కంటే ఎక్కువ వెచ్చించి చాహర్ ను కొనుగోలు చేసింది.
‘ప్లేయర్ సక్సెస్ అనేది పలికిన ధరను బట్టి లెక్కించలేం. నేను రూ.10లక్షలకు ఆడినా, రూ.80లక్షలకు ఆడినా బ్యాట్ తో పూర్తిగా జట్టు కోసం శ్రమించానా అనేదే ఆలోచిస్తా. అవును, చెన్నై నా మీద మరోసారి నమ్మకం ఉంచింది. అసలు మహీ భాయ్ నా మీద 2018లో చూపించింది పెద్ద బాధ్యత. జట్టుతో ఇన్నేళ్లుగా కలిసి ఉండటాన్ని బాగా ఎంజాయ్ చేశా’
Read Also : మేడారం జాతరకు రూ.2.5 కోట్ల నిధులు ప్రకటించిన కేంద్రం
‘సీఎస్కే నన్ను వేలంలో కొనుగోలు చేస్తుందని నాకు తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ నా మీద పూర్తి నమ్మకం ఉంచింది. డబ్బు గురించి మాట్లాడాలంటే.. నన్ను తీసుకోవడంలో ధోనీ పాత్ర ఉందంటే ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడు. నిజానికి జట్టు రిటెన్షన్ లిస్టులో తన పేరును కూడా రెండో వాడిగా ఎంచుకున్నాడు’
‘ఈ ఏడాది నా బాధ్యతల గురించి మాట్లాడితే.. గతంలో ఆడినట్లే ఇప్పుడు ఆడతా. ఆ స్థాయిలో ఆడలేకపోతే ప్రదర్శనను బెటర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్తున్నాడు దీపక్ చాహర్.