IPL 2023, CSK Vs RR: చెన్నై పై రాజస్థాన్ విజయం
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.

CSK Vs RR
IPL 2023, CSK Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లల్లో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది.
LIVE NEWS & UPDATES
-
చెన్నై పై రాజస్థాన్ విజయం
చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
ధోని జోరు.. జడేజా దూకుడు
ధోని జోరు పెంచాడు. జంపా వేసిన 18 ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదిన అతడు నాలుగో బంతికి సిక్స్ బాదాడు. 18 ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 19 ఓవర్‌ను జాసన్ హోల్డర్ వేయగా ఈ ఓవర్‌లో జడేజా రెండు సిక్స్‌లు ఓ ఫోర్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి ఆరు బంతుల్లో 21 పరుగులు కావాలి.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
చెన్నైను చాహల్ గట్టి దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 15వ తొలి బంతికి అంబటి రాయుడు(1)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతికి మూడు పరుగులు తీసి డేవాన్ కాన్వే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన కాన్వే.. జైశ్వాల్ చేతికి చిక్కాడు. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 113/6. ధోని 0, రవీంద్ర జడేజా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మోయిన్ అలీ ఔట్
రాజస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో మోయిన్ అలీ(7) భారీ షాట్‌కు యత్నించగా సందీప్ శర్మ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. 14 ఓవర్లకు చెన్నై స్కోరు 103/4, అంబటి రాయుడు 1, డేవాన్ కాన్వే 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
శివమ్ దూబే ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శివమ్ దూబే అశ్విన్ ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో 92 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు చెన్నై స్కోరు 93/3, మోయిన్ అలీ 1, డేవాన్ కాన్వే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
1 1 1 1 1 1
కుల్దీప్ సేన్ వేసిన ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు చెన్నై స్కోరు 86/2, శివమ్ దూబే 4, డేవాన్ కాన్వే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
రహానే ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రహానేను అశ్విన్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 78 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు చెన్నై స్కోరు 80/2, శివమ్ దూబే 1, డేవాన్ కాన్వే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
రహానే దూకుడు
రహానే దూకుడు పెంచాడు. ఆడమ్ జంపా వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు చెన్నై స్కోరు 76/1 డెవాన్ కాన్వే 35, అజింక్యా రహానే 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
9 పరుగులు
జాసన్ హోల్డర్ వేసిన ఎనిమిదవ ఓవర్‌లో డెవాన్ కాన్వే ఓ బౌండరీ కొట్టడంతో మొత్తం 9 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు చెన్నై స్కోరు 61/1 డెవాన్ కాన్వే 30, అజింక్యా రహానే 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
సిక్స్ కొట్టిన రహానే
వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్యా రహానే వేగంగా ఆడుతున్నాడు. అశ్విన్ వేసిన ఆరో ఓవర్‌లోని మూడో బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. పవర్లే (6 ఓవర్లు) పూర్తి అయ్యే సరికి చెన్నై స్కోరు 45/1 డెవాన్ కాన్వే 17, అజింక్యా రహానే 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న కాన్వే
తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడిన కాన్వే క్రమంగా దూకుడు పెంచాడు. ఆడమ్ జాంపా వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 35/1 డెవాన్ కాన్వే 16, అజింక్యా రహానే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
రెండు ఫోర్లు
జాసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు వచ్చాయి. నాలుగో బంతిని అజింక్యా రహానే, ఆఖరి బంతికి డెవాన్ కాన్వే బౌండరీ బాదారు. మొత్తంగా ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు చెన్నై స్కోరు 26/1 డెవాన్ కాన్వే 8, అజింక్యా రహానే 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
రుతురాజ్ గైక్వాడ్ ఔట్
చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్ కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ చేరుకున్నారు. దీంతో 10 పరుగుల వద్ద చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు చెన్నై స్కోరు 16/1. డెవాన్ కాన్వే 3, అజింక్యా రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మొదటి ఓవర్‌లో 7 పరుగులు
176 పరుగుల లక్ష్యంతో చెన్నై జట్టు బరిలోకి దిగింది. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టాడు. మొదటి ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. డెవాన్ కాన్వే 0, రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులతో ఉన్నారు.
-
చెన్నై లక్ష్యం 176
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్(52; 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్థశతకం బాదగా, దేవదత్ పడిక్కల్(38; 26 బంతుల్లో 5ఫోర్లు) షిమ్రాన్ హెట్మెయర్(30 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ ఓ వికెట్ తీశాడు.
-
బట్లర్ ఔట్
కీలక సమయంలో బట్లర్ ఔట్ అయ్యాడు. బట్లర్‌ను మోయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రాజస్థాన్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 36 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లతో బట్లర్ 52 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో మూడు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 144/5. షిమ్రాన్ హెట్మెయర్ 4, జురెల్ 1 పరుగుతో ఉన్నారు.
-
బట్లర్ అర్ధశతకం
మహేశ్ తీక్షణ వేసిన 16వ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి 33 బంతుల్లో బట్లర్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 141/4. జోస్ బట్లర్ 52, షిమ్రాన్ హెట్మెయర్ 2 పరుగులతో ఉన్నారు.
-
రెండు సిక్సర్లు కొట్టి ఔటైన అశ్విన్
ఆకాశ్ సింగ్ వేసిన 15 ఓవర్‌లోని రెండు, మూడు బంతులను అశ్విన్ సిక్సర్లుగా మలిచాడు. అదే ఊపులో ఆఖరి బంతిని భారీ షాట్‌కు యత్నించి మగాలా చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ 22 బంతుల్లో 1ఫోరు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 135/4. జోస్ బట్లర్ 48 పరుగులతో ఉన్నాడు.
-
నెమ్మదించిన పరుగుల వేగం
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో గత మూడు ఓవర్లుగా రాజస్థాన్ పరుగుల వేగం నెమ్మదించింది. మగాలా వేసిన 12వ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 104/3. బట్లర్ 41, అశ్విన్ 8 పరుగులతో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడుతున్న పడిక్కల్‌తో పాటు ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సంజు శాంసన్‌ను వికెట్లు తీశాడు. ఈ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 9 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 88/3. బట్లర్ 34, అశ్విన్ 0 పరుగుతో ఉన్నారు.
-
పడిక్కల్ ఔట్
రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడే క్రమంగా దేవదత్ పడిక్కల్ ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో డేవాన్ కాన్వే క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. పడిక్కల్ 26 బంతుల్లోనే 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోరు 88/2
-
రెండు సిక్సర్లు బాదిన బట్లర్
ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన బట్లర్ క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబడుతున్నాడు. మోయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌లోని ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 86/1. బట్లర్ 34, పడిక్కల్ 36 పరుగుతో ఉన్నారు.
-
11 పరుగులు
పవర్ ప్లే పూర్తి కాగానే జడేజా చేతికి బంతినిచ్చాడు ధోని. అయితే.. తొలి బంతిని లెగ్ సైడ్ వేయగా కొట్టడంలో బట్లర్ విఫలం అయ్యాడు. బంతి వైడ్‌గా వెళ్లింది. ధోనికి కూడా బంతి అందకపోవడంతో బౌండరీకి వెళ్లింది. ఎక్స్‌ట్రాల రూపంలో 5 వైడ్‌లు వచ్చాయి. మొత్తంగా ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 68/1. బట్లర్ 20, పడిక్కల్ 32 పరుగుతో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ బ్యాటర్లు
ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ రాజస్థాన్ బ్యాటర్లు దూకుడుగానే ఆడుతున్నారు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఆరో ఓవర్‌లో తొలి రెండు బంతులను పడిక్కల్ ఫోర్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 57/1. బట్లర్ 17, పడిక్కల్ 30 పరుగుతో ఉన్నారు.
-
బతికిపోయిన పడిక్కల్
దూకుడుగా ఆడేందుకు యత్నించే క్రమంలో మహేశ్ తీక్షణ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ స్లిప్‌లో జారవిడిచారు. దీంతో పడిక్కల్‌కు జీవనదానం లభించింది. ఈ ఓవర్‌లోని రెండో బంతికి బట్లర్ సిక్స్ కొట్టగా లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నాలుగో బంతిని పడిక్కల్ ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి బట్లర్ బంతిని బౌండరీకి తరలించడంతో ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 45/1. బట్లర్ 15, పడిక్కల్ 20 పరుగుతో ఉన్నారు.
-
6 పరుగులు
అరంగ్రేట బౌలర్ అయిన ఆకాశ్ సింగ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగో ఓవర్‌లో కేవలం 6 పరుగులే ఇచ్చాడు. 4 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 28/1. బట్లర్ 4, పడిక్కల్ 14 పరుగుతో ఉన్నారు.
-
పడిక్కల్ దూకుడు
యశస్వి జైస్వాల్ ఔట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నాడు. మహేశ్ తీక్షణ వేసిన మూడో ఓవర్‌లోని మూడు, నాలుగు బంతులను బౌండరీలకు తరలించాడు. 3 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 22/1. బట్లర్ 2, పడిక్కల్ 10 పరుగుతో ఉన్నారు.
-
యశస్వి జైస్వాల్ ఔట్
రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 12/1. బట్లర్ 1, పడిక్కల్ 1 పరుగుతో ఉన్నారు.
-
రెండు ఫోర్లు కొట్టిన జైస్వాల్
ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్ లో 8 పరుగులు వచ్చాయి. మూడు, నాలుగు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీలుగా మలిచాడు.
-
బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్
టాస్ ఓడిన రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మైదానంలోకి అడుగుపెట్టారు. ఆకాశ్ సింగ్ తొలి ఓవర్‌ను వేస్తున్నాడు
-
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
-
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), సిసంద మగాలా, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్
-
టాస్ గెలిచిన చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచాడు. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఆడిన తొలి మ్యాచ్‌తో పోలిస్తే పిచ్ కొంచెం భిన్నంగా స్పందించవచ్చు. ఇది స్లో ట్రాక్ అని బావిస్తున్నా. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండొచ్చు. గాయాల కారణంగా కొందరు ఆటగాళ్లు దూరం అయ్యారు. అయినప్పటికీ మేము గెలిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం. అభిమానుల మద్దతు మాకు ఎంతో ఉత్సాహనిస్తుంది అని ధోని అన్నాడు.