IPL 2023 Schedule: మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచులో తలపడనున్న గుజరాత్, చెన్నై

ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే.

IPL 2023 Schedule: టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ సీజన్ (16వ) ఐపీఎల్ జరగనుంది. అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి.

ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. మే 28న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. కాగా, ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ రనపర్ గా నిలిచింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఎంతో ప్రత్యేకం. గెలిచేది ఏ జట్టు అయినా అది తమ జట్టుగానే భావిస్తారు భారతీయులు. మొత్తం 10 జట్లు ఉన్నప్పటికీ ఒక్కో అభిమానికి ఒక్కో జట్టు ఫేవరెట్ గా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి అన్ని సీజన్లూ సూపర్ హిట్ అయ్యాయి. కొత్త కుర్రాళ్లలో ప్రతిభను బయటకు తీయడానికి, వారిని ప్రోత్సహించడానికి కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఐపీఎల్ పూర్తి షెడ్యూల్..


IPL 2023 Schedule

 

 

ట్రెండింగ్ వార్తలు