IPL 2024 : ఇషాంత్ శర్మ సూపర్ యార్కర్.. ర‌స్సెల్‌కు దిమ్మతిరిగిపోయింది.. ఔటయ్యాక ఏం చేశాడంటే?

డీసీ బౌలర్ ఇషాంత్ శర్మ చివరి ఓవర్లో అద్భుత బౌలింగ్ చేయడంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డును సొంతం చేసుకోలేక పోయింది.

Ishant Sharma

Ishant Sharma : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య విశాఖట్నంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. ఓపెనింగ్ బ్యాటర్ సునీల్ నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ (39 బంతుల్లో 85 పరుగులు) ఆడటంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేకేఆర్ జట్టు 272 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కేకేఆర్ జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read : IPL 2024 : తృటిలో చేజారిన రికార్డు..! ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుదే రెండో అత్యధిక స్కోరు

ఈ మ్యాచ్ చివరి ఓవర్లో డీసీ బౌలర్ ఇషాంత్ శర్మ వేసిన యార్కర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చివరి ఓవర్ తొలి బంతికే ఇషాంత్ శర్మ యార్కర్ బాల్ వేసి ఆండ్రి రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇషాంత్ నుంచి అలాంటి బాల్ వస్తుందని ఊహించని రస్సెల్.. బాల్ ను ఎదుర్కొనే క్రమంలో వికెట్ల వద్ద కిందపడిపోయాడు. వెంటనే తేరుకొని ఏం జరిగిందని చూసేసరికి వికెట్లు పడిఉన్నాయి. రస్సెల్ లేచి పెవిలియన్ కు వెళ్లే క్రమంలో ఇషాంత్ శర్మను అభినందిస్తూ వెళ్లాడు. ఇషాంత్ వేసిన యార్కర్ తో స్టేడియంలోని ప్రేక్షకులుసైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రమణదీప్ సింగ్ (2)ను ఇషాంత్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఇషాంత్ వేసిన చివరి ఓవరల్లో ఢిల్లీ బ్యాటర్లు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే రాబట్టగలిగారు.

Also Read : ఐపీఎలే ముద్దు.. పాకిస్థాన్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డుమ్మా

డీసీ బౌలర్ ఇషాంత్ శర్మ చివరి ఓవర్లో అద్భుత బౌలింగ్ చేయడంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డును సొంతం చేసుకోలేక పోయింది. ఐపీఎల్ 2013లో బెంగళూరు జట్టు 263 పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోర్ రికార్డును 11ఏళ్ల తరువాత ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. 277 పరుగులతో సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే, కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో చివరి ఓవర్లో రస్సెల్ ఔట్ కాకపోయి ఉంటే కేకేఆర్ జట్టు హైదరాబాద్ జట్టు రికార్డును బ్రేక్ చేసి ఉండేది. ఇందుకోసం చివరి ఓవర్లో కేకేఆర్ జట్టు 14 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, ఇషాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ జట్టు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది. దీంతో 277 పరుగులు చేసి కేకేఆర్ జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.

 

 

ట్రెండింగ్ వార్తలు