ఐపీఎలే ముద్దు.. పాకిస్థాన్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డుమ్మా

పాకిస్థాన్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ముద్దు అంటున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు. ఐపీఎల్ కారణంగా పాకిస్థాన్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు 9 మంది కివీస్ ప్లేయర్లు దూరమయ్యారు.

ఐపీఎలే ముద్దు.. పాకిస్థాన్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డుమ్మా

Photos Credit: www.iplt20.com

New Zealand Cricketers: పాకిస్థాన్ సిరీస్ కంటే ఐపీఎల్ తమకు ముఖ్యమంటున్నారు కివీస్ స్టార్ క్రికెటర్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడుతున్న 9 మంది న్యూజిలాండ్ క్రికెటర్లు పాక్‌తో సిరీస్‌కు నో  చెప్పారు. దీంతో ద్వతీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం 16 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించింది.

మార్క్ చాప్‌మన్, ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్‌లతో కూడిన జట్టుకు మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, కేన్ విలియమ్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిట్‌మెంట్‌ల కారణంగా అందుబాటులో లేరని న్యూజిలాండ్ క్రికెట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న డెవాన్ కాన్వే కూడా తర్వాతి మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడు.

Also Read: ల‌క్నోకు భారీ షాక్‌.. రూ.6.4 కోట్లు పెట్టికొన్న‌ ఆట‌గాడు ఐపీఎల్‌కు దూరం

టీ20 ప్రపంచ కప్‌కు ముందు పాకిస్థాన్‌తో సిరీస్‌కు కివీస్ సిద్ధమైంది. అయితే స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతుండడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వారికి ఈ సిరీస్ నుంచి మినహాయింపు ఇచ్చింది. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేన్ విలియమ్సన్.. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కొనసాగుతున్నాడు. లాకీ ఫెర్గూసన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మాట్ హెన్రీ.. లక్నో సూపర్ జెయింట్స్, గ్లెన్ ఫిలిప్స్.. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నారు.

పాకిస్థాన్ పర్యటనకు ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టు
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ రూర్క్, టిమ్‌ఎస్ రాబిన్సన్, బెన్‌ఎస్ రాబిన్సన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోధి.

Also Read: బాధ‌తో ఒంటరిగా డ‌గౌట్‌లో కూర్చున్న‌ హార్దిక్ పాండ్య‌.. ఓదార్చిన అంబ‌టి రాయుడు