IPL 2024 : తృటిలో చేజారిన రికార్డు..! ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుదే రెండో అత్యధిక స్కోరు

ఐపీఎల్ 2013లో బెంగళూరు జట్టు 263 పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోర్ రికార్డును 11ఏళ్ల తరువాత ఈ సీజన్ లో

IPL 2024 : తృటిలో చేజారిన రికార్డు..! ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుదే రెండో అత్యధిక స్కోరు

KOLKATA KNIGHT RIDERS

IPL 2024 KKR vs DC : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య విశాఖట్నంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు చేసింది. సునీల్ నరైన్ 39 బంతుల్లో 85 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. రఘువంశీ 54 పరుగులు, రసెల్ 41 పరుగులతో రాణించారు. చివరిలో రింకూ సింగ్ కేవలం ఎనిమిది బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేకేఆర్ జట్టు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద స్కోర్.

Also Read : ఐపీఎలే ముద్దు.. పాకిస్థాన్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు డుమ్మా

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, అభిషేక్ షోరెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో 33 పరుగులకే ఢిల్లీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. పంత్ (55), స్టబ్స్ (54)పరుగులు చేయడంతో 17.2 ఓవర్లలో ఢిల్లీ జట్టు 166 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కేకేఆర్ జట్టు 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read : LSG : ల‌క్నోకు భారీ షాక్‌.. రూ.6.4 కోట్లు పెట్టికొన్న‌ ఆట‌గాడు ఐపీఎల్‌కు దూరం

ఐపీఎల్ 2013లో బెంగళూరు జట్టు 263 పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోర్ రికార్డును 11ఏళ్ల తరువాత ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేక్ చేసింది. 277 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించింది. విశాఖలో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. ఆ జట్టు ఊపుచూస్తే కొత్త రికార్డు నమోదవడం ఖాయంగా కనిపించింది. చివరి ఓవర్లో మరో 14 పరుగులు కొడితే ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయ్యేది. కానీ, చివరి ఓవర్లో డీసీ బౌలర్ ఇషాంత్ తొలి మూడు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్లో కేవలం కేకేఆర్ బ్యాటర్లు ఎనిమిది పరుగులే రాబట్టగలిగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేకేఆర్ జట్టు 272 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా తృటిలో ఐపీఎల్ లో రికార్డు స్కోరును కేకేఆర్ జట్టు చేజార్చుకున్నట్లయింది.