CSK vs SRH : చెన్నై ఓటమికి ఆ ముగ్గురు ప్లేయర్లే కారణమా..! ఎలాఅంటే..

చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన కారణమన్న చర్చ జరుగుతుంది. వారిలో ముఖేశ్ చౌదరి ఒకరు.

Sunrisers Hyderabad

CSK vs SRH IPL 2024 : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులుచేసి విజయకేతనం ఎగురవేసింది. అయితే, సీఎస్కే ఓటమికి ముగ్గురు ప్లేయర్లు ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు.

Also Read : IPL 2024 : ధోనీ బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఏం చేశారో తెలుసా.. వీడియోలు వైరల్

చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన కారణమన్న చర్చ జరుగుతుంది. వారిలో ముఖేశ్ చౌదరి ఒకరు. ముఖేశ్ ఈ సీజన్ లో తన మొదటి మ్యాచ్ ను ఆడుతున్నాడు. దీంతో అతను వేసిన తొలి ఓవర్లోనే 27 పరుగులు ఇచ్చాడు. ముఖేష్ వేసిన ఓవర్ కారణంగా హైదరాబాద్ పవర్ ప్లేలోనే తన విజయాన్ని ఖాయం చేసుకుంది. దీని తరువాత ముఖేష్ కు మళ్లీ బంతి అందలేదు. ముఖేశ్ తో పాటు రచిన్ రవీంద్ర కూడా సీఎస్కే ఓటమి కారణమైన వారిలో ఒకడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మరోసారి విఫలమయ్యాడు. కేవలం తొమ్మిది బంతులు మాత్రమేఆడి 12 పరుగులు చేశాడు. ఆరంభంలో వేగంగా పరుగులు రాకపోవడంతో, రచిన్ ఔట్ కావడంతో కెప్టెన్ గైక్వాడ్ కూడా స్వేచ్ఛగా ఆడలేక పోయాడు.

Also Read : IPL 2024 : సొంతగడ్డపై చెలరేగిన హైదరాబాద్.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం

హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమికి బ్యాటర్ రహానే కూడా కారణమని చెప్పొచ్చు. రహానే నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. రహానే తన ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అంటే కేవలం మూడు బంతుల్లోనే 14 పరుగులు చేశాడు. మిగిలిన 27 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. రహానే నెమ్మదిగా ఆడటం వల్ల మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో వారు రన్స్ రాబట్టే క్రమంలో ఔట్ అయ్యారు. రహానే స్పీడ్ గా పరుగులు రాబట్టిఉండుంటే జట్టు స్కోర్ పెరిగే అవకాశం ఉండేది. హైదరాబాద్ బ్యాటర్ల దూకుడుకు ఆదిలోనే సీఎస్కే బౌలర్లు బ్రేక్ వేసినట్లయితే. మ్యాచ్ సీఎస్కే చేతుల్లోకి వచ్చేది.