IPL 2024 : ధోనీ బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఏం చేశారో తెలుసా.. వీడియోలు వైరల్
మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఉప్పల్ స్టేడియం ధోనీ మార్మోగిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ చివరి సీజన్ అనే వార్తల నేపథ్యంలో హైదరాబాదీ అభిమానులు

MS Dhoni
CSK vs SRH IPL 2024 : ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 5) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. హైదరాబాద్ ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ (50; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. అభిషేక్ శర్మ (37), ట్రావిస్ హెడ్ (31) పరుగులతో రాణించారు.
Also Read : IPL 2024 : సొంతగడ్డపై చెలరేగిన హైదరాబాద్.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం
మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఉప్పల్ స్టేడియం ధోనీ నామస్మరణతో మార్మోగిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్ చివరి సీజన్ అనే వార్తల నేపథ్యంలో హైదరాబాదీ అభిమానులు పెద్ద ఎత్తున పసుపు జెర్సీలు ధరించి స్టేడియానికి వచ్చారు. 20వ ఓవరల్లో మిచెల్ ఔటవడంతో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగు పెట్టాడు. ధోనీ బ్యాట్ తో స్టేడియంలో ఉన్నంత సేపు ప్రేక్షకులు ధోనీ నామస్మరణతో ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. ధోనీ క్రీజులోకి వచ్చిన సమయానికి కేవలం మూడు బంతులే ఉండటంతో 20వ ఓవర్లో ఐదో బంతిని ధోనీ ఫుల్ షాట్ ఆడగా సింగిల్ మాత్రమే వచ్చింది. చివరి బంతిని జడేజా ఆడాడు.
Also Read : ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లు తోసేసిన అభిమానులు
మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ కు మైదానంలోకి వచ్చే సమయంలో ప్రేక్షకులంతా లేచినిలబడి ధోనీ.. ధోనీ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు రావడంతో రెండు నిమిషాలు మాత్రమే బ్యాట్ తో మైదానంలో ఉన్నాడు. ఆ కొద్దిసేపు ఉప్పల్ స్టేడియం ధోనీ.. ధోనీ అంటూ హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ.. ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు నేను ఎప్పుడూ విననంత పెద్ద శబ్దం గ్రౌండ్ లో విన్నాను అంటూ పేర్కొన్నాడు.
https://twitter.com/CricCrazyJohns/status/1776314420857389395
https://twitter.com/mufaddal_vohra/status/1776238728715133302?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1776238728715133302%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Ablank