Gautam Gambhir : చెన్నైతో మ్యాచ్‌కు ముందు ధోని పై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డు ఎన్న‌టికి వ‌దిలి పెట్ట‌డు

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంట‌ర్ గౌత‌మ్ గంభీర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనితో త‌న‌కు ఉన్న పోటీని గుర్తు చేసుకున్నాడు.

IPL 2024 MS Dhoni never gives up says Gautam Gambhir

Gautam Gambhir – MS Dhoni : టీమ్ఇండియా మాజీ ఓపెన‌ర్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంట‌ర్ గౌత‌మ్ గంభీర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనితో త‌న‌కు ఉన్న పోటీని గుర్తు చేసుకున్నాడు. తాను కోల్‌క‌తాకు కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో చెన్నైతో జ‌రిగే మ్యాచ్‌ను ఎంతో ఆస్వాదించాన‌ని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమ‌వారం చెపాక్‌ వేదిక‌గా కోల్‌క‌తాతో చెన్నై త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో గంభీర్ పాత రోజుల‌ను గుర్తు చేసుకున్నాడు.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్‌గా రెండు ఐపీఎల్ టైటిల్స్‌ను అందించాడు గౌతమ్ గంభీర్‌. మొద‌టి సారి కోల్‌క‌తా క‌ప్పును అందుకున్న స‌మ‌యంలో ఫైన‌ల్‌లో చెన్నైని ఓడించ‌డం విశేషం. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా విజ‌య‌వంతంగా ఛేదించింది. మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు వ‌రుస‌గా మూడో సారి చెన్నైను క‌ప్పును ముద్దాడ‌కుండా చేసింది.

చెన్నైతో మ్యాచ్‌కు ముందు ఎలాంటి ఆలోచ‌న ఉంది అనే ప్ర‌శ్న ఎదురుకాగా.. ‘అవును.. మేమిద్దం స్నేహితులం. పర‌స్ప‌ర గౌర‌వం ఉంది. అయితే.. నేను గెల‌వాల‌నుకున్నాను. ఆ విష‌యంలో ఎంతో స్ప‌ష్టంగా ఉన్నా. అప్పుడు నేనే కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్నాను. అత‌డు సీఎస్‌కేకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డికి ఇదే ప్ర‌శ్న వేస్తే బ‌హుశా అత‌డి నుంచి కూడా అదే స‌మాధానం వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. టీమ్ఇండియా త‌రుపున‌ విజ‌య‌వంత‌మైన కెప్టెన్ల‌లో ఎంఎస్ ధోని ఒక‌రు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన అత‌డిలాంటి కెప్టెన్ మ‌రొక‌రు వ‌స్తార‌ని నేను అనుకోవ‌డం లేదు.’ అని గంభీర్ అన్నాడు.

Delhi Capitals : వ‌రుస ఓట‌ముల నేప‌థ్యంలో ఢిల్లీ కీల‌క నిర్ణ‌యం.. రూ.50ల‌క్ష‌ల‌కు కొత్త ప్లేయ‌ర్‌..

ప్ర‌స్తుత సీజ‌న్‌లో కోల్‌క‌తా అద్భుత ఫామ్‌లో ఉన్న‌ప్ప‌టికీ చెన్నైని లైట్‌గా తీసుకోవ‌డానికి లేద‌న్నాడు. చెన్నైని ఓడించ‌డం ఎంతో క‌ఠిన‌మైన‌దన్నాడు. ధోని సామ‌ర్థ్యాల‌ను గంభీర్ మెచ్చుకున్నాడు. చివ‌రి ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు చేయాల్సి ఉన్నా కూడా ధోనికి అది చాలా తేలికైన ప‌ని అన్నాడు.

ఐపీఎల్‌లో ఆడ‌టాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేసిన‌ట్లు గంభీర్ తెలిపాడు. త‌న‌కు ఎంఎస్ ధోని ప్రణాళిక‌ల‌పై ఓ అంచ‌నా ఉంద‌న్నాడు. అత‌డికి స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొనాలో తెలుసు. బ్యాట‌ర్ల‌పై ఒత్త‌డి పెంచేందుకు ఫీల్డ‌ర్ల‌ను ఎక్క‌డెక్క‌డ ఉంచావో స్ప‌ష్టమైన అవ‌గాహ‌న ఉంది. అత‌డు ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌స్తాడు. అత‌డు చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉంటే త‌ప్ప‌కుండా గేమ్‌ను మ‌న నుంచి లాగేసుకుంటాడు అని గంభీర్ తెలిపారు.

గ‌త‌వారమే గంభీర్ చెన్నైకి చేరుకున్నాడు. సూపర్ కింగ్స్‌ను దెబ్బతీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. చెపాక్‌లో KKRతో శిక్షణా సెషన్లలో ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో క‌లిసి గంభీర్ తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్లు కనిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి, శ్రేయాస్ అయ్యర్ కేకేఆర్‌ల‌కు నాయకత్వం వహిస్తుండగా.. MS ధోని, గౌతమ్ గంభీర్‌ల మధ్య వ్యూహాత్మక యుద్ధాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Rohit Sharma : ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజ‌యం.. రోహిత్ శ‌ర్మ మూడు ప‌దాల పోస్ట్ వైర‌ల్‌..

ట్రెండింగ్ వార్తలు