Mumbai Indians
Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు విజయం సాధించింది.తద్వారా పాయింట్ల పట్టికలో విజయాల ఖాతా తెరిచింది. 2024 టోర్నీలో ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది.. నాలుగో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించింది. ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్ (49), ఇషాన్ (42) మంచి ఆరంభాన్ని అందించారు. చివర్లో టిమ్ డేవిడ్ (45నాటౌట్), షెఫర్డ్ (39నాటౌట్) రాణించడంతో ముంబై స్కోర్ 234 కు చేరింది. 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో పృథ్వీ (66), స్టబ్స్ (77) ఆఫ్ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు.
Also Read : IPL 2024 : ఒంటిచేత్తో రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే
ముంబై హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే, హోం గ్రౌండ్ లో ముంబై జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ20 క్రికెట్ లో 150 మ్యాచ్ లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై తరువాత ఆ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది. ఆ జట్టు మొత్తం 148 మ్యాచ్ లను గెలుచుకుంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు టీ20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ లేకుండానే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.
Also Read : IPL 2024 : గుజరాత్ చిత్తు.. లక్నో హ్యాట్రిక్ విజయం.. ముచ్చటగా మూడోసారి..!
WANKHEDE CROWD GETS A SUPERB MATCH. ⭐ pic.twitter.com/HOEAsTTFkH
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024