IPL 2024 : గుజరాత్ చిత్తు.. లక్నో హ్యాట్రిక్ విజయం.. ముచ్చటగా మూడోసారి..!
IPL 2024 : సొంతగడ్డపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన యశ్ ఠాకూర్ (5/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

IPL 2024 _ Lucknow Bag 3rd Win, Beat Gujarat Titans By 33 Runs
IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం (ఏప్రిల్ 7న) లక్నోలోని ఎక్నా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. సొంతగడ్డపై లక్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను చిత్తు చేసింది.
33 పరుగుల తేడాతో గుజరాత్ పరాజయం పాలైంది. లక్నో నిర్దేశించిన 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గుజరాత్ టైటాన్స్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే చేతులేత్తేసింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది.
Read Also : MI vs DC : ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ పై ఘన విజయం
సాయి సుదర్శన్‌దే టాప్ స్కోర్ :
బ్యాటింగ్‌లో తడబడిన గుజరాత్ ఆటగాళ్లు ఎవరూ గట్టిపోరాటం ఇవ్వలేదు. సాయి సుదర్శన్ 23 బంతుల్లో 31 పరుగులతో పర్వాలేదనిపించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 5 బంతుల్లో (1), బీఆర్ శరత్ 5 బంతుల్లో (2), విజయ్ శంకర్ 17 బంతుల్లో (17), దర్శన్ నెల్కండే 11 బంతుల్లో (12) పరుగులు, రషీద్ ఖాన్ 3 బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేదు. ఉమేష్ యాదవ్ 4 బంతుల్లో (2), నూర్ అహ్మద్ (4) పరుగులు చేసి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దాంతో లక్నో బౌలర్‌కు గుజరాత్ ఏ ఆటగాడు బ్యాట్‌తో సమాధానం చెప్పలేకపోయారు.
యశ్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ :
లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, యశ్ ఠాకూర్ కూడా 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీసుకున్నాడు. రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు. లక్నో మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన బౌలర్ యశ్ ఠాకూర్ (5/30)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
For his magnificent 5️⃣ wicket haul, Yash Thakur becomes the Player of the Match in the #LSGvGT clash ?
Scorecard ▶️ https://t.co/P0VeEL9OOV#TATAIPL pic.twitter.com/CtA3SxgYRu
— IndianPremierLeague (@IPL) April 7, 2024
అదరగొట్టిన స్టోయినిస్.. హాఫ్ సెంచరీ :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (58; 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, నికోలస్ పూరన్ (32; 22 బంతుల్లో 3 సిక్సులు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (33; 31 బంతుల్లో 3ఫోర్లు) రాణించారు.
Marcus Stoinis walked in at 18-2 and did this ?? pic.twitter.com/Iu5PG7gFEy
— Lucknow Super Giants (@LucknowIPL) April 7, 2024
మిగతా లక్నో ఆటగాళ్లలో ఆయుష్ బదోని (2), దేవదత్ పడిక్కల్ (7), క్వింటన్ డికాక్ (6), కృనాల్ పాండ్యా (2) పరుగులతో సరిపెట్టుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే తలో రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
3వ స్థానంలో లక్నో :
పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి ఒక మ్యాచ్ ఓడి 6 పాయిట్లతో 3వ స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 ఓడి 4 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.
At the end of 21 matches, here’s how the Points Table looks! ?
Does your favourite team feature in the Top 4?#TATAIPL pic.twitter.com/35prqdGrdp
— IndianPremierLeague (@IPL) April 7, 2024