MI vs DC : ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ పై ఘన విజయం
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ గెలుపు బోణీ కొట్టింది.

PIC Credit @MI Twitter
IPL 2024 – MI vs DC : ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (71 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ నాలుగు వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా రెండు, రొమారియో షెపర్డ్ ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ(49; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్సర్లు), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) మొదటి వికెట్‌కు 7 ఓవర్లలోనే 80 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
సూర్యకుమార్ విఫలమైనా..
ముఖ్యంగా రోహిత్ శర్మ తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుపడ్డాడు. దీంతో ముంబై పవర్ ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది. కాగా.. హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో రోహిత్ శర్మను ఓ చక్కటి బంతితో అక్షర్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. రీ ఎంట్రీలో సూర్యకుమార్ యాదవ్ విఫలం అయ్యాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే అతడు నోకియా బౌలింగ్‌లో జేక్ ప్రేజర్ చేతికి చిక్కి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్‌కు అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. అతడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ఇషాన్ ఆ తరువాతి బంతికి అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ(6) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అతడు ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 121 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Virender Sehwag : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేట్ పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ దశలో హార్దిక్ పాండ్య (39; 33 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు తొలుత కుదురుకోవడానికి ప్రయత్నించారు. కుదురుకున్నాక భారీ షాట్లు ఆడే క్రమంలో హార్దిక్ ఔట్ అయినా డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. 17వ ఓవర్‌లో 17 పరుగులు, 18వ ఓవర్‌లో 16 పరుగులు, 19వ ఓవర్‌లో 19 పరుగులు పిండుకున్నాడు.
చెలరేగిన షెఫార్డ్..
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రొమారియో షెపర్డ్ పెను విధ్వంసం సృష్టించాడు. నోకియా వేసిన ఈ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాది 32 పరుగులు రాబట్టాడు. దీంతో ముంబై భారీ స్కోరు సాధించింది.
FIRST WIN FOR CAPTAIN HARDIK PANDYA IN IPL 2024.
– The happiness on his face says everything! ? pic.twitter.com/xTVeNXlO5b
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024