Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ఢిల్లీ పై 1000 ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా.. కోహ్లి రికార్డు జ‌స్ట్ మిస్‌

ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. ఢిల్లీ పై 1000 ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా.. కోహ్లి రికార్డు జ‌స్ట్ మిస్‌

PIC Credit @ MI twitter

Updated On : April 7, 2024 / 5:06 PM IST

Rohit Sharma 1000 Runs against DC : ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ముంబై వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 49 ప‌రుగులు చేయ‌డం ద్వారా అత‌డు ఈఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఢిల్లీ జ‌ట్టు పై 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. మ‌రో ఐదు ప‌రుగులు చేసి ఉంటే.. ఢిల్లీ జ‌ట్టు పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించేవాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లి ఢిల్లీ పై వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..
విరాట్ కోహ్లి – 1030 ప‌రుగులు
రోహిత్ శర్మ – 1026 ప‌రుగులు
అజింక్య రహానే – 858 ప‌రుగులు

Virender Sehwag : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేట్ పై వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఐపీఎల్ చ‌రిత్రలో రెండు జ‌ట్ల పై 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. హిట్‌మ్యాన్ త‌న కెరీర్‌లో ఢిల్లీతో పాటు కోల్‌క‌తా పైనా కూడా వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ లు మాత్ర‌మే అత‌డి కంటే ముందు ఉన్నారు. ఢిల్లీ, చెన్నై పై కోహ్లి, కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ పై వార్న‌ర్‌లు వెయ్యి ప‌రుగులు సాధించారు.

IPLలో రెండు జ‌ట్ల పై 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్ – పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై
విరాట్ కోహ్లీ – ఢిల్లీ క్యాపిట‌ల్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ పై
రోహిత్ శర్మ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై

Jos Buttler : ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఒక్క సెంచ‌రీ ఎన్నో రికార్డులు..