Jos Buttler : ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఒక్క సెంచ‌రీ ఎన్నో రికార్డులు..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌ జోస్ బ‌ట్ల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు.

Jos Buttler : ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ఒక్క సెంచ‌రీ ఎన్నో రికార్డులు..

PIC Credit @ RR twitter

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌ జోస్ బ‌ట్ల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్‌లో త‌న 100వ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన మొద‌టి విదేశీ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. శ‌నివారం జైపూర్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జరిగిన మ్యాచ్‌లో అత‌డు సెంచ‌రీ చేయ‌డం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ 58 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 100 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి జ‌ట్టును గెలిపించాడు. ఈ శ‌త‌కంతో బ‌ట్ల‌ర్ ప‌లు రికార్డుల‌ను న‌మోదు చేశాడు.

– ఐపీఎల్ కెరీర్‌లో త‌న 100వ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన రెండవ ఆట‌గాడిగా నిలిచాడు. 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

– తాజా శ‌త‌క ప్ర‌ద‌ర్శ‌న‌తో బ‌ట్ల‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. 11 సార్లు అత‌డు ఈ అవార్డును అందుకున్నాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఈ రికార్డు అజింక్యా ర‌హానే (10సార్లు) పేరిట ఉండేది.

– ఐపీఎల్ కెరీర్‌లో 100వ మ్యాచ్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. 2022లో కేఎల్ రాహుల్ 60 బంతుల్లో సెంచ‌రీ చేయ‌గా బ‌ట్ల‌ర్ 58 బంతుల్లోనే శ‌త‌క్కొట్టాడు.

Virat Kohli : కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే స్లోయెస్ట్ సెంచ‌రీ..

– తాజా శ‌త‌కంతో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా బ‌ట్ల‌ర్ నిలిచాడు. ఈ జాబితాలో కెప్టెన్ సంజూ శాంసన్ (3389) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా జోస్ బట్లర్ (2831) అజింక్యా రహానె (2810)లు ఉన్నారు.

– ఐపీఎల్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో బ‌ట్ల‌ర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు క్రిస్‌గేల్ రికార్డును స‌మం చేశాడు. ఐపీఎల్ అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ ఇప్ప‌టి వ‌ర‌కు 8 సెంచ‌రీలు చేశాడు. ఆ త‌రువాత క్రిస్ గేల్ (6 సెంచరీలు), జోస్ బట్లర్ (6 సెంచరీలు) లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113నాటౌట్‌) సెంచ‌రీ చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.1ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (58బంతుల్లో 100నాటౌట్ ), సంజూశాంస‌న్ (42 బంతుల్లో 69) దంచికొట్టారు.

IPL 2024 : రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెష‌న్‌లో ఏం చేశారో చూడండి.. మీరూ నవ్వాపుకోలేరు.. వీడియో వైరల్