Gujarat Titans to 3-wicket win over Punjab Kings
IPL 2024 : ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా అతికష్టం మీద గెలిచింది. 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులతో విజయాన్ని అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో రాహుల్ తివాతియా (36; 18 బంతుల్లో 7 ఫోర్లు) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
సాయి సుదర్శన్ (31), శుభమన్ గిల్ (35) పరుగులతో రాణించగా.. వృద్ధిమాన్ సాహా (13), డేవిడ్ మిల్లర్ (4), అజ్మతుల్లా ఒమర్జాయ్ (13), షారుఖ్ ఖాన్ (8) పరుగులకే చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, అర్ష్ దీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్ 2 వికెట్లు, సామ్ కరన్ తలో వికెట్ తీసుకున్నారు.
టాప్ స్కోరర్‌గా ప్రభసిమ్రాన్ సింగ్ :
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ సామ్ కరన్ (20) పరుగులకే చేతులేత్తేయగా, ప్రభసిమ్రాన్ సింగ్ (35) పరుగులతో టాప్ స్కోరరుగా నిలిచాడు. హర్ ప్రీత్ బ్రార్ (29), హర్ ప్రీత్ సింగ్ భాటియా (3), శశాంక్ సింగ్ (8), లియామ్ లివింగ్ స్టోన్ (6), జితేష్ శర్మ (13), రిలీ రోసోవ్ (9), రబడ (1) పరుగుతో ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు.
దాంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 142 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 4 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ తలో 2 వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి కిషోర్ (4/33)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
టాప్ 6లో గుజరాత్ టైటాన్స్ :
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఆడిన 8 మ్యాచ్‌లలో 4 గెలిచి 4 ఓడింది. దాంతో 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 6 మ్యాచ్‌లలో ఓడి 4 పాయింట్లతో 9వ స్థానంలోకి పడిపోయింది.
A fantastic 4-wicket haul by Sai Kishore & he wins the Player of the Match Award in Match 3️⃣7️⃣ of today’s Super Sunday double-header ?
Scorecard ▶️ https://t.co/avVO2pCwJO#TATAIPL | #PBKSvGT | @gujarat_titans pic.twitter.com/aaNNIybPsH
— IndianPremierLeague (@IPL) April 21, 2024