IPL 2025
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. “ముందుగా బౌలింగ్ చేస్తాం. కెప్టెన్సీ అనేది చాలా గొప్ప విషయం. 17 సంవత్సరాల వయస్సులో ఇక్కడ ఆడాను. మళ్లీ ఇప్పుడు ఇలా ఇక్కడ ఆడుతుండడం చాలా ఉత్సాహాన్నిస్తోంది. మేము మా కీలక ఆటగాళ్లను జట్టులో కొనసాగిస్తున్నాం. ఇది బ్యాటింగ్ ఆర్డర్‌కు సహాయపడుతుంది. చాలా ప్రాక్టీస్ చేశాము” అని అన్నాడు.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: సంజు శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్