GT vs SRH : స‌న్‌రైజ‌ర్స్, గుజ‌రాత్‌ మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్ చేసిన ఈ త‌ప్పును గ‌మ‌నించారా?

గుజ‌రాత్‌, స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్రాడ్ కాస్ట‌ర్ ఓ మిస్టేక్ చేశాడు.

IPL 2025 Broadcaster DRS Blunder in GT vs SRH Game

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా శుక్ర‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ 38 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. జీటీ బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (38 బంతుల్లో 76 ప‌రుగులు), జోస్ బ‌ట్ల‌ర్ (37 బంతుల్లో 64 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఎస్ఆర్‌హెచ్‌ బౌల‌ర్ల‌లో జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ మూడు వికెట్లు తీయ‌గా.. జీషన్ అన్సారీ, పాట్ క‌మిన్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు.

GT vs SRH : అంపైర్‌తో గొడ‌వ పై స్పందించిన గిల్‌.. అందుకే అలా చేశా..

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌డ‌బ‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(41 బంతుల్లో 74 ప‌రుగులు) అర్థ‌శ‌త‌కాన్ని బాదాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇషాంత్ శ‌ర్మ‌, జెరాల్డ్ కోట్జీ లు త‌లా ఓ వికెట్ తీశారు.

బ్రాడ్‌కాస్ట‌ర్ మిస్టేక్‌..

ఇక ఈ మ్యాచ్ స‌మ‌యంలో బ్రాడ్ కాస్ట‌ర్ ఓ మిస్టేక్ చేశాడు. ప్ర‌స్తుతం అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గుజ‌రాత్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఉన్నాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని ఉనాద్క‌త్‌ ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంగా బంతిని సంధించాడు. దీంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. అయితే.. అంపైర్ నిర్ణ‌యం పై ఎస్ఆర్‌హెచ్ రివ్య్వూ తీసుకుంది.

SRH playoffs scenario : లక్కంటే ఇదే.. గుజరాత్ చేతిలో ఓడినా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లే చాన్స్.. ఇదిగో లెక్క..

థ‌ర్డ్ అంపైర్ రిప్లేను ప‌రిశీలించే స‌మ‌యంలో.. బ్రాడ్ కాస్ట‌ర్ పొర‌పాటున వైడ్ బంతిని కాకుండా అంత‌క‌ముందు బంతిని రిప్లేలో చూపించాడు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.