DC vs MI : ఓట‌మి బాధ‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ బీసీసీఐ బిగ్ షాక్..

అస‌లే తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన బాధ‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌కు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు తొలి ఓట‌మిని చ‌విచూసింది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఓట‌మి బాధ‌లో ఉన్న ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాకిచ్చారు. రూ.12ల‌క్ష‌ల ఫైన్ వేశారు.

ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ స్లో ఓవ‌ర్ రేటుకు పాల్ప‌డింది. నిర్ణీత స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఓవ‌ర్ల‌ను పూర్తి చేయ‌లేక‌పోవ‌డంతో ఆ జ‌ట్టు కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్‌కు ఐపీఎల్ అడ్వైజ‌రీ క‌మిటీ జ‌రిమానా విధించింది. ఢిల్లీ ఈ సీజ‌న్‌లో స్లో ఓవ‌ర్ న‌మోదు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో రూ.12ల‌క్ష‌ల ఫైన‌ల్ విధించారు.

CSK : పృథ్వీ షాకు షాక్‌.. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో 17 ఏళ్ల కుర్రాడిని తీసుకున్న చెన్నైసూప‌ర్ కింగ్స్‌..!

‘ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్ నంబర్ 29లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం ఇది. కాబట్టి.. పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది.’ అని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిపి ఆరుగురు కెప్టెన్లు స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేశారు. సంజు సామ్సన్, రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).

Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (33 బంతుల్లో 59 ప‌రులుగు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ (28 బంతుల్లో 40 ప‌రుగులు), రికిల్‌టన్ (25 బంతుల్లో 41 ప‌రుగులు), న‌మ‌న్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్) లు రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో విప్రజ్ నిగమ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ముకేశ్ కుమార్ ఓ వికెట్ తీశాడు.

అనంత‌రం క‌రుణ్ నాయ‌ర్ (89; 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించానా ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ 19 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ముంబై బౌల‌ర్ల‌లో కర్ణ్‌ శర్మ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మిచెల్ సాంట్న‌ర్ రెండు వికెట్లు, జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ తీశాడు.