CSK : పృథ్వీ షాకు షాక్.. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో 17 ఏళ్ల కుర్రాడిని తీసుకున్న చెన్నైసూపర్ కింగ్స్..!
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై యువ ఆటగాడిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

17 year old star to replace Ruturaj Gaikwad in CSK squad for IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 17 ఏళ్ల యువ ఆటగాడు ఆయుష్ మాత్రేను జట్టులోకి తీసుకుంది.
ఐపీఎల్‌లో సరైన కాంబినేషన్‌ను కనుగొనడంలో ఇబ్బందులు పడుతున్న చెన్నై జట్టు మోచేతి గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమైన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యువ ముంబై ఓపెనర్ ఆయుష్ మాత్రేను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
RR vs RCB : అయ్యో.. కోహ్లీ భయ్యా నీకేమైంది? ఆ ఘటనతో ఆందోళనలో ఫ్యాన్స్.. వీడియో వైరల్..
17-YEAR-OLD AYUSH MHATRE LIKELY TO JOIN CSK SQUAD FOR IPL 2025. [Sahil Malhotra from TOI] pic.twitter.com/2ZjdU7BezU
— Johns. (@CricCrazyJohns) April 13, 2025
వెంటనే అతడిని జట్టులో చేరాలని కోరినట్లుగా పేర్కొంది. అయితే.. అతడు మరో రెండు రోజుల తరువాతనే జట్టులో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.30 లక్షల బేస్ వేలంలో పాల్గొన్న ఆయుష్ మాత్రేను మెగావేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.
ప్రస్తుతం చెన్నై జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడేందుకు లక్నోలో ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో చెన్నై, లక్నో జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 20న ముంబైలో వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆయుష్ మాత్రే ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎస్‌కే మేనేజ్‌మెంట్.. గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ నిజార్‌తో పాటు ఫ్రాంచైజీ ఆయుష్ మాత్రేను ట్రయల్స్ కోసం చెన్నైకి పిలిపించారట. ఇక మెగావేలంలో అమ్ముడుపోని పృథ్వీ షా సైతం రుతురాజ్ స్థానంలో తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా.. రుతురాజ్ స్థానంలో మాత్రేను తీసుకోవాలని చెన్నై నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
17 ఏళ్ల ఆయుష్ మాత్రే.. తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు 504 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఏడు లిస్ట్ మ్యాచ్‌ల్లో 458 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.