IPL 2025 Final: సూపర్ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాల్ట్..

ధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపాడు సాల్ట్.

Courtesy BCCI @IPL

IPL 2025 Final: ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్ ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. సూపర్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ దగ్గర ఎంతో తెలివిగా క్యాచ్ అందుకున్నాడు. హేజిల్ వుడ్ బౌలింగ్ లో పంజాబ్ కింగ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య షాట్ కొట్టాడు. దాన్ని ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టిన సాల్ట్.. బంతిని గాల్లోకి ఎగరేశాడు. బౌండరీ లైన్ నుంచి ఈపక్కకి వచ్చి మళ్లీ బాల్ ని అందుకున్నాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్యను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపాడు సాల్ట్.