IPL 2025: ముంబై ఓటమి తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. ఆ కారణంగానే ఓడిపోయారట..

ముంబై ఇండియన్స్ ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.

Hardik Pandya (Courtesy BCCI)

IPL 2025: ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తొలి మ్యాచ్ లో సీఎస్కే జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై.. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఓవరల్లో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ హార్దిక్ సేన ఓటమి పాలైంది.

Also Read: IPL 2025 : ముంబై ఇండియన్స్ పై గుజరాత్ విజయం

ముంబై ఇండియన్స్ ఓటమి అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు చేసిన చిన్నచిన్న తప్పుల వల్లనే ఓడిపోయామని అన్నారు. ‘‘మేము చాలా చిన్నచిన్న తప్పులు చేశాం. ఫీల్డింగ్ లో కొన్ని పొరపాట్ల కారణంగా 20-25 పరుగులు కోల్పోయాము. టీ20 ఆటలో ఇవి చాలా ఎక్కువ. గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ జట్లు బ్యాటర్లు రిస్క్ లేని షాట్లు ఆడి పరుగులు సాధించగలిగారు.’’ అని హార్దిక్ అన్నారు.

Also Read: GT vs MI : గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు శుభ‌వార్త‌.. ఆ డేంజ‌ర‌స్‌ ప్లేయ‌ర్ వ‌చ్చేశాడు..

ఇది ఐపీఎల్ -2025 ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి. రాబోయే మ్యాచ్ లలో జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే మా జట్టులోని బ్యాటర్లు వీలైనంత త్వరగా తమ బాధ్యతను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని హార్దిక్ పాండ్యా అన్నారు. రాబోయే మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశాడు.

 

ఇదిలాఉంటే.. నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ మైదానంలో గుజరాత్ మూడు మ్యాచ్ లలో ముంబై జట్టును ఓడించింది. ఈ మైదానంలో మొత్తం గుజరాత్ నాలుగు సార్లు, ముంబై ఇండియన్స్ రెండు సార్లు విజేతలుగా నిలిచాయి.