IPL 2025 : ముంబై ఇండియన్స్ పై గుజరాత్ విజయం

IPL 2025 : ముంబై ఇండియన్స్ పై గుజరాత్ విజయం

Courtesy BCCI

Updated On : March 29, 2025 / 11:42 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Also Read : ధోనికి షాక్‌.. సొంత అభిమానుల నుంచే రిటైర్‌మెంట్‌కు డిమాండ్‌..! ‘త‌లా’ ఇక చాలు

197 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. ఆ జట్టు సూర్య కుమార్ యాదవ్(48), తిలక్ వర్మ(39) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా గుజరాత్ కు ఇదే తొలి విజయం.