IPL 2025 : తిరుగులేని గుజరాత్.. వరుసగా నాలుగో విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్ కు తిరుగులేదు. విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్ లో మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 58 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది వరుసగా నాలుగో విక్టరీ. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది.

218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హెట్ మైర్ హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 41 పరుగులు, రియాన్ పరాగ్ 26 రన్స్ చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రిసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, సాయి కిశోర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంతో తలో వికెట్ తీశారు.

Also Read : ఒక్క ఓవ‌ర్‌లో 11 బాల్స్ వేసిన శార్దూల్ ఠాకూర్.. ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవ‌ర్లు వేసిన బౌల‌ర్లు ఎవ‌రంటే..?

ఈ సీజన్ లో వరుస విజయాలతో గుజరాత్ దూకుడు మీదుంది. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. తాజా గెలుపుతో పాయింట్ల టేబుల్ లో రెండో స్థానం నుంచి టాప్ లోకి వెళ్లింది. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఇది మూడో ఓటమి. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన రాజస్థాన్ కు గుజరాత్ చేతిలో పరాజయం ఎదురైంది. పాయింట్ల టేబుల్ లో 7వ స్థానంలో ఉంది.