Shardul Thakur : ఒక్క ఓవర్‌లో 11 బాల్స్ వేసిన శార్దూల్ ఠాకూర్.. ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్లు వేసిన బౌలర్లు ఎవరంటే..?
లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టైటిల్ రేసులో ఖచ్చితంగా ఉంటాయని భావించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో నాలుగు పరుగు తేడాతో విజయాన్ని సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఓవర్‌లో అతడు 11 బంతులను వేశాడు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. మొత్తంగా 11 బంతులతో ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ ఓవర్‌లోని చివరి బంతికి అతడు కేకేఆర్ కెప్టెన్ రహానేను ఔట్ చేయడం విశేషం.
కాగా.. కేకేఆర్ మ్యాచ్‌లో శార్దూల్ నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్‌ను వేసిన బౌలర్లు వీరే..
* తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్) – 2023లో లక్నో పై 11 బంతులు (0,1,2,nb,wd,nb,wd,4,wd,6,0)
* మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 2023లో ముంబై పై 11 బంతులు(0,1,wd,wd,wd,wd,2,4,wd,4,0)
* శార్దూల్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్) – 2025లో కోల్‌కతా పై 11 బంతులు (wd,wd,wd,wd,wd,wd,1,1,0,4,2,W)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్) దంచికొట్టారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా, ఆండ్రీ రసెల్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్యా రహానే (35 బంతుల్లో 61), వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 45), రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: ‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని..’ సంజీవ్ గొమెంకా, పంత్ పిక్ వైరల్..
చదవండి: మెల్లమెల్లగా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండగా.. నేనెందుకు..